ఆ హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో టీమిండియా క్రికెటర్.. తెలిసిపోయిందిగా..
ఇటీవల కాలంలో ఆమె సినిమాల కంటే తన వ్యక్తిగత జీవితం గురించే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. కొన్నేళ్లుగా ఆమె హీరో ఆదిత్య రాయ్ కపూర్ ను ప్రేమించింది. వీళ్లిద్దరూ కలిసి విదేశాలకు వెళ్లిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ ఇప్పుడు వీళ్లిద్దరూ విడిపోయారని వార్తలు వస్తున్నాయి. ఆదిత్యతో విడిపోయిన తర్వాత, అనన్య టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో సంబంధం ఉందని వార్తలు వచ్చాయి. అనంత్ అంబానీ పెళ్లిలో వీళ్లిద్దరూ కలిసి డాన్స్ చేస్తున్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.
ఇప్పుడు మళ్ళీ కొత్త రూమర్ ఏంటంటే, అనన్య మరో క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌ని ప్రేమిస్తుందని. శుభ్‌మన్ గిల్ ఇండియన్ క్రికెట్ టీమ్‌లో చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కొన్ని రోజుల నుంచి అనన్య పాండే, శుభ్‌మన్ గిల్ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ తాజా ఇంటర్వ్యూలో అనన్య ఈ వార్తలను ఖండించింది. ఒక ఫ్యాన్ అనన్యను ఉద్దేశించి. "మీరు, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ లాగా ప్రేమలో ఉన్నారా? వీళ్లిద్దరూ ఒక యాడ్ షూట్లో కలిసి పనిచేసిన తర్వాత ప్రేమలో పడ్డారు కదా?" అని అడిగాడు.
దీనికి అనన్య "మేము ఇద్దరం చాలా డిఫరెంట్ మార్గాల్లో నడుస్తున్నాం. అతడితో నేను ఎప్పుడూ ప్రేమలో లేము. మేము ఒక యాడ్‌కి ప్రమోషన్ చేయడానికి మాత్రమే కలిశాము. ఆ తర్వాత మేము మాట్లాడుకోలేదు." అని చెప్పింది. సమాధానం చెప్పింది. శుభ్‌మన్ గిల్ గురించి చాలా వార్తలు వస్తుంటాయి. ప్రత్యేకించి ఆయన ఎవరితో ప్రేమలో ఉన్నారనే విషయం గురించి ఎక్కువగా వార్తలు వస్తుంటాయి. మొదట ఆయన సారా టెండూల్కర్ తో ప్రేమలో ఉన్నారని, తర్వాత సారా అలీఖాన్‌తో ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అనన్య పాండేతో ఆయన ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఇంతేకాకుండా, ఆయన ఒక టీవీ సీరియల్ నటితో కూడా ప్రేమ సంబంధం ఉందని కూడా రూమర్స్ వస్తున్నాయి.