దేవర కలక్షన్స్ తో ఎలర్ట్ అయిన పుష్ప 2 !

Seetha Sailaja
‘పుష్ప 2’ విడుదలకు ఇక కేవలం రెండు నెలలు మాత్రమే మిగిలి ఉండటంతో ఇప్పుడు ఈమూవీని అనుకున్న డేట్ కు ఏదోవిధంగా విడుదలచేయాలి అన్న ఆలోచనలతో సుకుమార్ పరుగులు తీస్తున్నాడు. ఆమధ్య ఈ మూవీ విడుదల వాయిదా పడుతుంది అన్న లీకులు రావడంతో ఎలర్ట్ అయిన సుకుమార్ ఎట్టి పరిస్థితులలోను ఈమూవీని అనుకున్న తేదీకి విడుదలచేయాలి అన్న పట్టుదలతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.  

డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ‘దేవర’ ఓపెనింగ్స్ రికార్డ్ స్థాయిలో ఉండటమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి మొదటిరోజు 172 కోట్లు గ్రాస్ వచ్చినట్లు ఈమూవీ నిర్మాతల నుండి లీకులు వస్తూ ఉండటంతో ఇప్పుడు ఈరేంజ్ కలక్షన్స్ దాటవలసిన ఒత్తిడి ‘పుష్ప 2’ పై ఉంది. ‘పుష్ప’ మూవీతో పోల్చుకుంటే ‘దేవర’ విడుదలకు ముందు బాలీవుడ్ లో ఈమూవీ పై పెద్దగా అంచనాలు లేవు.

అయితే ఈమూవీ విడుదల అయిన తరువాత మొదటిరోజు ఈవినింగ్ షోస్ నుండి ‘దేవర’ బుకింగ్స్ ఊపు అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వీకెండ్ లో కూడ ‘దేవర’ కలక్షన్స్ స్పీడ్ ఇలాగే కొనసాగితే ఈమూవీ చాల సులువుగా 500 వందల కోట్ల గ్రాస్ చేరుకోగలిగితే ఈమూవీ బయ్యర్లు ఇంచుమించు సేఫ్ లోకి వెళ్ళిపోతారు అన్న వార్తలు వస్తున్నాయి. జరుగుతున్న ఈ పరిణామాలు అన్నీ పరిశీలిస్తే ‘దేవర’ కలక్షన్స్ ‘పుష్ప 2’ కు కొత్త టార్గెట్ ను ఫిక్స్ చేస్తుంది అని అంటున్నారు.

‘పుష్ప 2’ పై బాలీవుడ్ లో కూడ భారీ క్రేజ్ ఉండటంతో ఈమూవీ మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేయగలిగితే ఈమూవీ టార్గెట్ గా పెట్టుకున్న 1000 కోట్లు కలక్షన్స్ చేరుకోవచ్చు అన్న అంచనాలు వస్తున్నాయి. ఈ టార్గెట్ ను మనసులో పెట్టుకుని ‘పుష్ప’ నిర్మాతలు ఈమూవీ ప్రమోషన్ ను నవంబర్ నుండి మొదలు పెట్టి దేశవ్యాప్తంగా ఈమూవీ పై క్రేజ్ పెంచాలని ఆలోచిస్తున్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: