యూకేలో హై-పేయింగ్ జాబ్ వదిలేశాడు.. కట్ చేస్తే స్టార్ హీరో అయిపోయాడు..?
* అంత మంచి లైఫ్ ఉన్న సినిమాలంటేనే ఇష్టం
* బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా సొంత టాలెంట్‌తో స్టార్ హీరో రేంజ్కి ఎదిగిన నవీన్
( ఏపీ - ఇండియా హెరాల్డ్)
ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరో రేంజ్కి ఎదిగిన నటులు ఎంతోమంది ఉన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ ని చూసుకుంటే రవితేజ చిరంజీవి ఇలా చాలామంది స్వశక్తితో పైకి వచ్చారు. ఇటీవల కాలంలో నవీన్ పొలిశెట్టి బీభత్సమైన టాలెంట్, కృషి పట్టుదలతో స్టార్ హీరో అయిపోయాడు. ఇతనికి సినీబ్యాక్‌గ్రౌండ్ శూన్యం. నవీన్ పొలిశెట్టి హైదరాబాద్‌లోని ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు.ఈ హీరో భోపాల్‌లోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీ అయిన మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు. చదువు పూర్తయ్యాక, పూణేలోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. అక్కడ కొంతకాలం పనిచేసిన తర్వాత, ఇంగ్లాండ్‌కు వెళ్లి అక్కడ కూడా ఉద్యోగం చేశాడు.
కానీ, నవీన్‌కు అక్కడ పని చేయడం నచ్చలేదు. అందుకే, ఒకరోజు తన ఉద్యోగం నుంచి వైదొలిగి, తన తల్లిదండ్రులకు చెప్పకుండా రహస్యంగా భారతదేశానికి తిరిగి వచ్చారు. ఇక్కడ పొట్టనింపుకునేందుకు చిన్న చిన్న పనులు చేస్తూ, నాటకాలలో నటిస్తూ కొంతకాలం కష్టపడ్డాడు. ఆ తర్వాత, ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’, ‘1: నేనొక్కడినే’ వంటి తెలుగు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేయడం మొదలుపెట్టాడు.
2015 నాటికి నవీన్ స్టాండప్ కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత, అతను ‘ఆల్ ఇండియా బక్‌చోద్’ యూట్యూబ్ ఛానెల్ స్కిట్స్‌లో నటించడం మొదలుపెట్టాడు. ఈ స్కిట్స్‌లో అతను సాధారణ మధ్యతరగతి యువకుడి పాత్రను చేసి, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ‘హానెస్ట్ ఇంజనీరింగ్ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్’ స్కిట్‌లో అతని నటన ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.
2019 సంవత్సరం నవీన్ జీవితాన్ని ఒక కీలక మలుపు తిప్పింది. ఆ సంవత్సరంలో అతని కెరీర్‌లో రెండు పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి. మొదట, సుశాంత్ సింగ్ రాజపుత్ నటించిన ‘చిచ్చోరే’ సినిమాలో అతను ఒక చిన్న పాత్ర చేశాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అదే సంవత్సరంలోనే, అతను హీరోగా నటించిన మొదటి సినిమా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ విడుదలైంది. ఈ సినిమా కూడా ఊహించని విధంగా విజయం సాధించింది.
నవీన్ ఇటీవల కాలంలో తెలుగు సినిమాల్లో హీరోగా నటిస్తూ పెద్ద పెద్ద హిట్స్ అందుకుంటున్నాడు. ఆయన నటించిన ‘జాతి రత్నాలు’ సినిమా 2021లో విడుదలై 70 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. అంతేకాకుండా, గత నెలలో విడుదలైన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా కూడా 50 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.ఈ నేపథ్యంలో, బాలీవుడ్‌లో ప్రసిద్ధి గాంచిన దర్శకుడు నితేశ్ తివారి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘రామాయణం’లో లక్ష్మణుడి పాత్రను నవీన్ చేయబోతున్నట్లు సినీ వర్గాల వారు చెబుతున్నారు. ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి, లక్ష్మణుడి పాత్రలో నవీన్ నటిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ 400 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. దీని ద్వారా నవీన్ కెరీర్‌లో మరో మలుపు తిరగబోతోంది.