బాలయ్య - బాబీ కాంబో.. ఆ సీన్ కోసమైనా తప్పక చూడాల్సిందే..!

Divya
నటసింహా నందమూరి బాలకృష్ణ  తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎనలేని గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. సినీ ఇండస్ట్రీలో ఇటీవలే 50 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా..సిల్వర్ జూబ్లీ ఏర్పాటు చేసి గౌరవంగా సత్కరించారు కూడా.. నటసింహ నందమూరి బాలకృష్ణ తన తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు స్వీయ దర్శకత్వంలో వచ్చిన చిత్రాల ద్వారా యుక్త వయసులోనే ఇండస్ట్రీకి అడుగుపెట్టారు.  అప్పట్నుంచి వరుస చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ముఖ్యంగా మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన నందమూరి బాలకృష్ణ ఇప్పటికీ కూడా అటు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలతో కూడా అలరిస్తున్నారు.
ఇదిలా ఉండగా  చివరిగా భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య ఇప్పుడు బాబి డైరెక్షన్లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అందరి అంచనాలు ఈ సినిమా పైనే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా కూడా ఉండబోతుందని సమాచారం ఇదిలా ఉండగా ఈ సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్ ని చిత్రీకరిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బాబి , బాలయ్య కాంబినేషన్లో వస్తున్న సినిమాను  ఈ సన్నివేశం కోసమైనా చూడాలని చెబుతున్నారు మేకర్స్ .

ఇదిలా ఉండగా ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ గా నిలవబోతోందని సమాచారం. మొత్తానికైతే ఆయన చేసిన సినిమాలు అన్నింటికంటే  కూడా బాబి తో చేస్తున్న సినిమా చాలా ప్రత్యేకమని,  బాలయ్య కెరియర్ కు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇస్తుంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు . మొత్తానికైతే బాలకృష్ణ బాబి డైరెక్షన్లో చేస్తున్న సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.  ఇకపోతే ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ దూసుకు వెళ్తున్న బాలకృష్ణ అఖండ -2  కూడా త్వరలోనే చేయబోతున్నట్లు సమాచారం. ముహూర్తం జరుపుకొని త్వరలోనే రెగ్యులర్ షూట్ కి వెళ్ళబోతుందట. మరి ఈ సినిమాలు బాలయ్యకు ఎలాంటి విజయాన్ని అందిస్తాయి. ఆయనకు ఏ ఎటువంటి గౌరవాన్ని అందిస్తాయి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: