టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకులలో కొరటాల శివ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో కథ రచయితగా పని చేశాడు. అందులో భాగంగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథలను అందించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అలా కథా రచయితగా అద్భుతమైన స్థాయిలో కెరియర్ను కొనసాగిస్తున్న సమయం లోనే ఈయన రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మిర్చి అనే మూవీ తో దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించాడు. ఈ మూవీ సూపర్ సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత ఈయన దర్శకత్వం వహించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి.
కొంత కాలం క్రితం ఈయన ఆచార్య మూవీ కి దర్శకత్వం వహించగా ఆ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. తాజాగా కొరటాల , జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దేవర పార్ట్ 1 అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ నిన్న విడుదల అయింది. ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ వచ్చింది. మొదటి నుండి కూడా కొరటాల పెద్ద స్ట్రెంత్ అద్భుతమైన మాటలను , డైలాగ్ లను రాయడం. ఈయన దర్శకత్వం వహించిన సినిమాలలో చాలా సినిమాలలోని డైలాగ్ లు , మాటలు ఇప్పటికీ కూడా ఎంతో ఫేమస్.
అంత గొప్పగా ఈయన డైలాగ్స్ రాస్తూ ఉంటాడు. ఇక దేవర పార్ట్ 1 మూవీ లో ఆయన స్థాయి డైలాగ్ లు ఎక్కడ కనిపించలేదు. కొన్ని డైలాగ్ లను రాసినా అవి కూడా పెద్ద ప్రేక్షక ఆదరణ పొందే స్థితిలో లేవు. మరి ఆయన స్ట్రెంత్ అయినటువంటి డైలాగ్స్ , మాటల విషయంలో ఈయన కాస్త దేవర విషయంలో వెనక పడిపోయాడు అని కొంత మంది జనాల అభిప్రాయ పడుతున్నారు. మరి రాబోయే సినిమాలలో కొరటాల తన స్ట్రెంగ్త్ ను పూర్తిగా ఉపయోగిస్తాడేమో చూడాలి.