ఫ్లాప్ అవుతుందని ముందే తెలుసా.. అందుకే తారక్ ఇంత తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాడా?
ఈ క్రమంలోనే దేవర సినిమాలోని నటించిన నటుల రెమ్యూనరేషన్ విషయం సంగతి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మిగతా నటీనటుల సంగతి ఏమోగానీ, జూనియర్ రెమ్యూనరేషన్ చూసిన అభిమానులు డిప్రెషన్ లోకి వెళ్లి పోయినట్టు తెలుస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే, ఎన్టీఆర్ ఈ సినిమాకి గాను కేవలం 60 కోట్ల రూపాయలు మాత్రమే తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుత హీరోలు వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న తరుణంలో, తమ హీరో డబల్ డిజిట్ రెమ్యూనరేషన్ తీసుకోవడంపై అభిమానులు సదరు నిర్మాతల పైన చాలా గుర్రుగా ఉన్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి.
మిగతా నటినటుల విషయానికి వస్తే, దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాకు 30 కోట్ల రూపాయలు తీసుకున్నట్టు సమాచారం. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ కి జోడిగా నటించిన జాన్వి ఐదు కోట్ల రూపాయలను తీసుకుందట. మరోవైపు ఈ సినిమాలో విలన్ పాత్రను పోషించిన బాలీవుడ్ యాక్షన్ హీరో సైఫ్ అలీ ఖాన్ 10 కోట్ల రూపాయలు, ప్రత్యేక పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్ రెండు కోట్ల రూపాయలు, వైవిధ్యభరితమైన పాత్రలో నటించిన శ్రీకాంత్ 50 లక్షలు, విచిత్రమైన పాత్రలో నటించిన నటుడు మురళీ శర్మ 40 లక్షల రూపాయలను తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక మిగతా నటుల రెమ్యూనరేషన్ విషయం పక్కనపెడితే, ఎన్టీఆర్ తీసుకున్న రెమ్యూనరేషన్ విషయం మాత్రం ఇప్పుడు వైరల్ అవుతుంది. సినిమా ప్లాఫ్ అవుతుందని ఎన్టీఆర్ కి ముందే తెలుసా? ఈ కథపై అంతగా నమ్మకం లేని ఎన్టీఆర్ అందుకే అంత తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నాడా? అనే అనుమానాలు ఇప్పుడు ఎంతమంది ప్రేక్షకులు లేవనెత్తుతున్నారు! దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ల రూపంలో తెలియజేయవచ్చు!