పాన్‌ ఇండియా: టాలీవుడ్‌ పరువు తీసేందుకే ఇలా చేస్తున్నారా?

Veldandi Saikiran
* టాలీవుడ్ లో అన్ని సినిమాలు పాన్ ఇండియాలే
* కథలో దమ్ము లేకపోయినా పాన్ ఇండియా గా  ప్రచారం
* పాన్ ఇండియా పేరుతో రిలీజ్ అయి బాలీవుడ్ లో బోల్తా
* బాలీవుడ్ లో టాలీవుడ్ కు తగ్గుతున్న ప్రాధాన్యత


టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో చాలావరకు... పెద్ద పెద్ద సినిమాల రిలీజ్ అవుతున్నాయి. పాన్ ఇండియా పేరుతో... చాలా సినిమాలు వచ్చేస్తున్నాయి. అయితే ఇందులో కొన్ని సక్సెస్... మరికొన్ని సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి.  బాహుబలి అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాలు మినహా... ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా రేంజ్ లో మన తెలుగు సినిమాలు ఎక్కడ ఆడలేదు. చిన్న హీరోని పెట్టి కూడా పాన్ ఇండియా సినిమా అనేస్తున్నారు.
 అంతేకాదు... ఒక సినిమాను రెండు భాగాలుగా విడగొట్టి.. పార్ట్ వన్ అలాగే పార్ట్ 2 అంటూ రిలీజ్ చేస్తున్నారు. దానివల్ల... సినిమా కథకే దెబ్బ పడుతోంది. కథను  మూడు గంటల్లో చెప్పాల్సింది.. రెండు భాగాలుగా విడగొట్టి ఆరు గంటలు చేస్తున్నారు. అలా చేయడంవల్ల బోరింగ్ గా ఫీల్ అవుతున్నారు జనాలు. అయితే ఇందులో పార్ట్ వన్.. ఫ్లాఫ్ అయింది అంటే సినిమా మొత్తం పోయినట్టే. ఆ సినిమాను ఎవరు కూడా చూడరు.
 అంతే కాదు పాన్ ఇండియా పేరుతో స్టార్ హీరోల టైం వేస్ట్ చేస్తున్నారు దర్శకులు. ఒక స్టార్ హీరో ఏడాదిలో మూడు నుంచి రెండు సినిమాలు కచ్చితంగా చేయాలి. కానీ పాన్ ఇండియా పేరుతో... స్టార్ హీరోల సమయాన్ని మొత్తం వృధా చేస్తున్నారు. రెండు భాగాలుగా విడదీస్తే డబ్బులు ఎక్కువగా వస్తాయని... టాలీవుడ్ పరువు తీస్తున్నారు కొంతమంది దర్శకనిర్మాతలు.
 అన్ని సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కావు. కానీ ఖచ్చితంగా పానీ ఇండియా రేంజ్ లో హిట్ అవుతాయని... రిలీజ్ చేసి ఇప్పుడు దేవర పరిస్థితి తెచ్చుకుంటున్నారు. దేవరానే కాదు... ఆది పురుష్, సాహో, లాంటి సినిమాలు కూడా...  పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయి అట్టర్ ఫ్లాఫ్ కావడం జరిగింది. అలా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేసి బాలీవుడ్ లో టాలీవుడ్ పరువు తీస్తున్నారు.  కాబట్టి ఇకనైనా... ఈ పాన్ ఇండియా విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: