జూనియర్ ఎన్టీఆర్ హీరో గా రూపొందిన దేవర మొదటి భాగం రేపు అనగా సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల కానుంది . ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వి కపూర్ హీరోయిన్గా నటించగా , అనిరుద్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు . ఈ మూవీ ని ప్న ఇండియా మూవీ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు . ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యం లో ఈ మూవీ ని అత్యంత భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు . ఈ సినిమాను విడుదల రోజు ప్రపంచ వ్యాప్తంగా చాలా థియేటర్ల లో రిలీజ్ చేయనున్నారు.
ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను విడుదల రోజు ప్రపంచ వ్యాప్తంగా 7100 నుండి 7250 థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్థాయిలో థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతోంది అంటే ఈ మూవీ కి గనుక బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చినట్లయితే మొదటి రోజు ఈ సినిమా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. మరి ఈ మూవీ ఏ రేంజ్ టాక్ ను తెచ్చుకొని ఏ స్థాయి కలక్షన్లను వసూలు చేస్తుందో చూడాలి. ఇప్పటివరకు ఈ సినిమా నుండి మూవీ బృందం అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది.
వాటికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. అలాగే ఈ సినిమా నుండి విడుదల చేసిన లిరికల్ వీడియో సాంగ్స్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మరి ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ కి ఏ స్థాయి విజయం , ఏ రేంజ్ క్రేజ్ వస్తాయో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే.