12 ఏళ్ళ పయనమే 'దేవర' సినిమా కథ?
ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాహ్నవి హీరోయిన్ గా విడుదల కాబోతున్న ‘దేవర’ సినిమా కథాంశం కూడా 80s నుంచి 90s మధ్యలో జరిగిన కథ అని సమాచారం. ఇక ఇదే విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొరటాల శివ చెప్పుకు రావడం జరిగింది. అందుకే దేవర సినిమా సెటప్ అంతా కూడా 80 నుంచి 90 దశకం మధ్యలోనే జరిగినట్టు చాలా స్పష్టంగా మనకి ట్రైలర్లలోనే కనబడుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ... ఈ సినిమాలో 12 ఏళ్ళ జర్నీ ఉంటుందని తెలియజేశారు. కొరటాల శివ చెప్పిన మాటల బట్టి రియల్ సంఘటన స్ఫూర్తితోనే ‘దేవర’ కథని రాసి ఉంటారనే మాట విశ్లేషకులు చెబుతున్నారు.
సినిమా రిలీజ్ కి ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉండడంతో మరీ ముఖ్యంగా, ఎన్టీఆర్ అభిమానులు అయితే కంటిమీద కునుకు లేకుండా సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రంగా ‘దేవర’ నిలుస్తుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇక థియేటర్ల దగ్గర అభిమానుల సందడి అయితే ఆల్రెడీ షురూ అయిపోయింది. మొదటి రోజు ఖచ్చితంగా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సినిమా కథాంశం గురించి కొరటాల చెప్పిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కూడా జనాల్లోకి బలంగా వెళ్లిందనే చెప్పుకోవాలి. ఎన్టీఆర్ ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ కోసం యూఎస్ వెళ్లారు. అక్కడ ఈ రోజు ప్రదర్శించబోయే ప్రీమియర్ షోలని తిలకించి అభిమానులని పలకరిస్తారు. తారక్ ని చూసేందుకు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.