ఈ మొగుడు నాకొద్దు... నాగార్జున హీరోయిన్ విడాకులు...?

Divya
1992లో నాగార్జున హీరోగా ఊర్మిళ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం అంతం. ఈ సినిమాతో ఊర్మిలకు మంచి ఇమేజ్ లభించింది. హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న ఊర్మిళ ఇప్పుడు విడాకులు తీసుకోబోతోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ లో వరుస చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఈమె విడాకులు తీసుకోబోతుందని తెలిసి ఫిలిం వర్గాలలో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. తన భర్త మోసిన్ అక్తర్ మీర్ తో వివాహ బంధాన్ని ముగించుకోవాలి ఊర్మిళ నిర్ణయించుకుందట. ఇప్పటికే ఆమె ముంబై కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు కూడా చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఊర్మిళ నుంచి ఈ విషయంపై ఎటువంటి ప్రకటన రాలేదు. కానీ గత నాలుగు నెలల క్రితమే ఊర్మిళా కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసినట్లు నేషనల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే ఈ విషయం తెలిసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. ఇద్దరు పరస్పర అంగీకారంతో విడిపోవడం లేదని , ఊర్మిళా మాత్రమే తన భర్త నుంచి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుందని , అందుకు గల కారణం మాత్రం తెలియరాలేదు అని సమాచారం. వీరి ప్రేమ , పెళ్లి విషయానికి వస్తే 2014లో ప్రముఖ బాలీవుడ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా మేనకోడలు పెళ్ళిలో మోసిన్,  ఊర్మిళ పరిచయమయ్యారట. కొద్దిరోజుల్లోనే వీరి పరిచయం ప్రేమగా మారి 2017లో కాశ్మీర్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఈ మోసిన అత్తర్ ను ఆమె వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఈమె వయసు 50 సంవత్సరాలు.
సినిమాలలో తనదైన ముద్ర వేసుకున్న ఈమె రాజకీయాల్లో కూడా 2019 కాంగ్రెస్ లో చేరి ముంబై నార్త్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.  ఆ తర్వాత 2020లో శివసేన పార్టీలో చేరింది. ఈమె భర్త కూడా నటుడే. 21 ఏళ్ల వయసులోనే కాశ్మీర్ నుంచి ముంబై వచ్చి పలు సినిమాలలో నటించారు. ఇక ఊర్మిళా నటించిన తెలుగు చిత్రాల విషయానికి వస్తే.. అంతం, ఓ భార్య కథ, అనగనగా ఒకరోజు, గాయం వంటి చిత్రాలలో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: