బిగ్ బాస్ బజ్ : అభయ్ ఇన్ని నిజాలు బయట పెట్టాడేంటి?

praveen
బిగ్ బాస్ సీజన్ 8లో 3వ వారంలోనే అందరూ అనుకున్నట్టుగా 'అభయ్ నవీన్' ఎలిమినేట్ అయిపోయిన సంగతి అందరికీ విదితమే. ముఖ్యంగా చెప్పుకోవాలంటే, బిగ్ బాస్‌పై అభయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు వల్లే మేకర్స్ ఎలిమినేట్ చేశారని చాలామంది ప్రేక్షకులు అనుకుంటున్నారు. అది ఒక్క కారణం మాత్రమే. అయితే చీఫ్ అయిన తర్వాత అభయ్‌లో వచ్చిన మార్పులు కూడా తనపై ఆడియన్స్‌లో నెగిటివ్ ఒపీనియన్ వచ్చేలా చేయడం మరో కారణం అని ఇక్కడ చెప్పుకోవాలి. హౌస్‌లో ఎలిమినేట్ అయ్యి స్టేజ్‌పైకి వచ్చేసిన తర్వాత రియలైజ్ అయ్యి, అందరి గురించి మంచిగా మాట్లాడిన అభయ్.. బిగ్ బాస్ బజ్‌లోకి ఎంటర్ అవ్వగానే ఇతర కంటెస్టెంట్స్‌పై తనకు ఉన్న నిజ స్వరూపాన్ని బయట పెట్టాడు. ఆ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది కూడా!
ఈ నేపథ్యంలోనే అభయ్ కొన్ని భిన్నాభిప్రాయాలను వెళ్లబుచ్చాడు. బిగ్ బాస్ ప్రోమోని ఒకసారి గమనిస్తే, ప్రోమో మొదలవ్వగానే సోనియా ఫోటోతో ఉన్న బెలూన్‌ను పగలగొట్టి ''అన్నీ తనకే తెలుసు అనుకుంటుంది'' అని తనపై గల అభిప్రాయం వ్యక్తం చేశాడు అభయ్ నవీన్. అదేవిధంగా ''తనలో ఉన్న లాయర్ అప్పుడప్పుడు బయటికి వస్తుంటుందా?'' అని అర్జున్ అడిగినపుడు, ''అప్పుడప్పుడు కాదు బ్రో! చాలాసార్లు వస్తుంటుంది?'' అని చెబుతాడు. ఇక సీత గురించి మాట్లాడుతూ... "తను అయితే చాలా ఎమోషనల్, కాస్త మెతక స్వభావం కలది... అయినా కచ్చితంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్! అని చెప్పగలను" అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే అభయ్ విష్ణు ప్రియ గురించి మాట్లాడుతూ.. "తను స్ట్రాంగా, వీకా అనేది అస్సలు తనకే తెలియదు!" అని వ్యంగ్యంగా కౌంటర్లు ఇచ్చాడు. ఈ క్రమంలోనే మరికొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు కూడా!
ఇక యష్మీ గురించి చెప్తూ.. గేమ్ జోన్‌లోనే ఆడదామని అనుకుంటుంది కానీ ఆడదని, పృథ్వి అయితే కొన్ని విషయాల్లో ఒక్క క్షణం కూడా అస్సలు బుర్ర పెట్టి ఆలోచించడు! అని చెప్పుకొచ్చాడు అభయ్ నవీన్. అదేవిధంగా నిఖిల్ గురించి మాట్లాడుతూ.. నేను వాడి అన్నగా వాడిని ఫైనల్‌లో చూడాలనుకుంటున్నాను! అంటూ మనసులోని విషయాన్ని బయట పెట్టాడు. కాగా నాగ మణికంఠకు 'మేల్ చంద్రముఖి' అంటూ ట్యాగ్ ఇచ్చేసాడు. ఎందుకంటే? ''ఆ రకంగా ఫ్లిప్ అయ్యే క్యారెక్టర్‌ను నేను ఇంతవరకు చూడలేదు!'' అని చెప్పుకొచ్చాడు. ఇక ఆఖరిగా తన గురించి మాట్లాడుతూ.... ఓవర్స్ కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడాడు. ఒక్కోసారి అది నెగిటివ్ అవుతుంది, కొన్నిసార్లు పాజిటివ్ అవుతుంది! నా విషయంలో మాత్రం నెగిటివ్ అయింది! అంటూ వాపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: