ఎన్టీఆర్, ప్రభాస్ ల లక్కీ హీరోయిన్ ఎవరో తెలుసా..? తీసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టరే..!!

murali krishna
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఒకప్పుడు స్టార్స్ అందరితో నటించి టాలీవుడ్ చందమామగా గుర్తింపు తెచ్చుకుంది. చిరంజీవి, బాలకృష్ణ, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి హీరోలతో సినిమాలు చేసి తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. తెలుగులోనే కాకుండా తమిళ, హిందీలోనే నటించి ఎన్నో సూపర్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంది. కెరీర్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్న క్రమంలో.. గౌతమ్ కిచ్లును ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైంది. అయితే కాజల్ ఓ బిడ్డకు తల్లి అయి.. మళ్లీ సినీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చింది. లేడీ ఓరియెంటెడ్ సినిమా సత్యభామతో కాజల్ ప్రేక్షకులను అలరించింది.ఇదిలావుండగా రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈశ్వర్ మూవీ తో హీరో గా కెరియర్ను మొదలు పెట్టిన ప్రభాస్ చాలా తక్కువ కాలంలోనే అనేక విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. మిర్చి మూవీ వరకు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగించిన ప్రభాస్ ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సిరీస్ మూవీలతో హీరోగా నటించాడు. ఈ మూవీలు అద్భుతమైన విజయం సాధించడంతో ఒక్క సారిగా ఇండియా వ్యాప్తంగా ప్రభాస్ కి క్రేజ్ లభించింది. దానితో ప్రస్తుతం ప్రభాస్ వరుస పెట్టి పాన్ ఇండియా మూవీ లలో హీరో గా నటిస్తూ వస్తున్నాడు.
ప్రభాస్ కెరియర్ లో ఓ హీరోయిన్ ఆయనకు బాగా కలిసి వచ్చింది. ఆ హీరోయిన్ తో ప్రభాస్ నటించిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు అందుకున్నాయి. ఆమె ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె కాజల్ అగర్వాల్. ప్రభాస్ , కాజల్ అగర్వాల్ కాంబోలో మొదటగా డార్లింగ్ మూవీ వచ్చింది. ఈ సినిమాకు కరుణాకరన్ దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ము అందుకుంది. ఈ సినిమాతో వీరి జంటకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు వచ్చాయి. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో మిస్టర్ పర్ఫెక్ట్ అనే మూవీ వచ్చింది.
ఈ సినిమా కూడా మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ మూవీ కి దశరథ్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో కూడా ఈ జంటకు మంచి ప్రశంసలు వచ్చాయి. అలా ప్రభాస్ , కాజల్ అగర్వాల్ కాంబో లో రెండు సినిమాలు రాగా ఈ రెండు మూడు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. అలాగే ఈ రెండు సినిమాలలో ఈ జంటకు కూడా మంచి ప్రశంసలు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి దక్కాయి.ఇదిలావుండగా మ్యాన్ ఆఫ్ మాస్సెస్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆర్ ఆర్ ఆర్ గ్లోబల్ రేంజ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ప్రస్తుతం తారక్ దేవర మూవీ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు.ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్, ప్రభాస్ గురించి ఓ న్యూస్ ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్, కాజల్ ఇద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి బృందావనం, బాద్షా, టెంపర్ సినిమాలు చేసారు. ఇక జనతా గ్యారేజ్‌లో ఐటం సాంగ్ కూడా చేసింది. ఈ పాట కూడా కేవలం ఎన్టీఆర్‌తో ఉన్న స్నేహం కారణంగానే చేసింది కాజల్ అగర్వాల్. సినిమాల్లోనే కాదు బయట కూడా ఈ ఇద్దరి స్నేహం ఇలాగే ఉంటుంది.ఈ సినిమాలు ఎన్టీఆర్ కి మంచి సక్సెస్ ని అందించాయి.ఇలా తారక్, ప్రభాస్ ఇద్దరు హీరోలకు కాజల్ లక్కీ హీరోయిన్గా మారింది. వీరి కాంబోలో వ‌చ్చిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో.. కాజ‌ల్‌కు కూడా స్టార్ హీరోయిన్గా మంచి ఇమేజె క్రియేట్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: