ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప పార్ట్ 2 అనే మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. డిసెంబర్ 6 వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ పై జనాల్లో ఆసక్తి బాగా పెరిగింది. ఆయన కూడా తన నెక్స్ట్ మూవీ ని త్వరగా ఫిక్స్ చేసుకోవాలి అని అనేక ప్రయత్నాలను చేస్తున్నట్లే కనిపిస్తోంది. కానీ అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటివరకు వెలువడలేదు.
ఇకపోతే అల్లు అర్జున్ కు అత్యంత ఆప్తుడు , సన్నిహితుడు , మిత్రుడు అయినటువంటి బన్నీ వాసు , బన్నీ సినిమాలకు సంబంధించి అప్పుడప్పుడు కొన్ని అప్డేట్లను విడుదల చేస్తూ వస్తున్నాడు. కొంత కాలం క్రితం అల్లు అర్జున్ తన నెక్స్ట్ మూవీ అట్లీ లేదా త్రివిక్రమ్ శ్రీనివాస్ లతో చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అయింది. ఆ తర్వాత అట్లీ మూవీ క్యాన్సిల్ అయింది అని , త్రివిక్రమ్ తోనే బన్నీ నెక్స్ట్ మూవీ ఉంటుంది అని ఓ వార్త వైరల్ అయింది. తాజాగా బన్నీ వాసు ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఈయన మళ్ళీ అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీల లిస్టు దర్శకులలో అట్లని జోడించాడు.
ఈయన మాట్లాడుతూ... అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ ఏ దర్శకుడితో ఉంటుందో చెప్పలేము. హీరో , దర్శకుడు కి ఉన్న వెసులుబాటు ప్రకారం అట్లీ , త్రివిక్రమ్ , సందీప్ రెడ్డి వంగా ఎవరితోనైనా అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ ఉండవచ్చు అని ఆయన చెప్పుకొచ్చాడు. ఇలా అనేక మంది పేర్లు బన్నీ నెక్స్ట్ మూవీ విషయంలో తెరపైకి వస్తూ ఉండడంతో అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరగా విడుదల చేస్తే బాగుంటుంది అని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.