చివరికి యాంకర్ సుమ కూడా దిగజారిందే.. ఎంత గలీజ్ మాటలు అంటే..?
ఈటీవీలో సుమ అడ్డా పేరిట ఆమె ఓ ప్రోగ్రాం చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రమోషన్ల కోసమే ఈ ప్రోగ్రాం నడిపిస్తున్నట్లుగా ఉంటుంది. కొత్త సినిమా హీరో హీరోయిన్లు దర్శకులు ఈ షో కి వచ్చే ప్రమోషన్ చేసుకుంటారు. అలాగే వారు ఇక్కడ ఆటలు ఆడతారు కబుర్లు చెప్పుకుంటారు. సుమ షోలన్నీ ఒకే లాగా ఉంటాయి. బోర్ కొట్టేస్తోంది అని ఇప్పటికే ఒక విమర్శ వచ్చింది. అయినా సరే ఆమె మొన్నటి కాక వెగటుతనం జోలికి పోలేదు.
కానీ హఠాత్తుగా ఆమె కూడా ఆర్థిక జారింది. టీఆర్పీల జాబితాలో సుమ ప్రోగ్రామ్స్ అట్టడుగు స్థాయిలో ఉంటున్నాయి. బహుశా ఆ కారణంగానే ఆమె కూడా అందరికి లాగానే చెడుగా మారినట్లు తెలుస్తోంది. సుమ అడ్డ లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించి ఓ ప్రోమో తాజాగా రిలీజ్ అయింది. బిగ్‌బాస్ కంటెస్టెంట్లు, అలానే మరో ఇద్దరు ఈ ఎపిసోడ్ కి విచ్చేశారు. వారిలో టేస్టీ తేజ, ఆట సందీప్, శోభాశెట్టి వంటి పాపులర్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు.
ఈ ప్రోమోలో ఆటలో భాగంగా ఒక స్క్రీన్‌పై ఆవులు, గేదెలు చూపిస్తారు అక్కడ రెండు మాత్రమే దున్నపోతులు ఉంటాయి. కానీ ఆట ఆడే లేడీ పార్టిసిపెంట్లు మాత్రం అక్కడ మూడు దున్నపోతులు ఉన్నట్టు రాశారు. స్క్రిప్టు ప్రకారం రెండు దున్నపోతుల పక్కనేకాస్త వంగి దున్నపోతు లాగా యాక్ట్ చేస్తూ నిల్చున్నాడు తేజ. అందుకే తమ మూడు రాసినట్లు ఆ లేడీ పార్టిసిపెంట్లు తెలిపారు. అప్పుడు యాంకర్ సుమ వెళ్లి పాలు పితకండి అని అంటుంది. దున్నపోతుకి పాలు పితకడం అనేది చాలా పెద్ద బూతు మాట. మీకు పాలు పిండటం వచ్చు కదా నేను మిమ్మల్ని టెస్ట్ చేయాలని అనుకుంటున్నా అని సుమా ఉంటుంది. తమకు పాలు పిండడం వచ్చు అని ఒక ఆమె అనగానే సరే ఓకే పిండండి అని అంటుంది. దాంతో అందరూ వెకిలిగా నవ్వుతుంటారు. ఆ లేడీ పార్టిసిపేంట్ దున్నపోతు పైపు చూస్తూ ఇదే ఎక్కడైనా పిండాల్సింది అని అంటుంది తర్వాత అందరూ మరింత నవ్వుతారు.
సుమ కూడా దానిని బాగా లాగుతుంది. మొత్తం మీద ఇది ఒక బూతు షో లాగా అనిపిస్తుంది. చివరికి సుమ కూడా ఇలాంటి అడల్ట్ జోక్స్ వేయడం చాలా మందిని షాక్‌కి గురి చేస్తోంది. టిఆర్పి రేటింగ్స్ కోసం ఇలాంటి జోక్స్ అవసరం లేదని ఆమెకు చాలామంది సలహా ఇస్తున్నారు. ఎప్పటిలాగానే చక్కగా జోకులు చేసుకుంటూ ఉంటే చెడ్డ పేరు రాదని పేర్కొంటున్నారు.