బాలయ్య 109లో మరో మైండ్ బ్లాకింగ్ న్యూస్‌... ఫ్యీజులు ఎగిరి పూన‌కాలు రావాల్సిందే..!

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) .
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు కొల్లి ర‌వీంద్ర ( బాబీ ) కాంబినేషన్ లో తెర‌కెక్కుతోన్న‌ సినిమా వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. బాల‌య్య ప్ర‌స్తుతం అఖండ - వీర‌సింహారెడ్డి - భ‌గ‌వంత్ కేస‌రి ఈ మూడు సినిమా ల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి హ్యాట్రిక్ హిట్లు కొట్టి తిరుగులేని ఫామ్ లో ఉన్నారు. దీంతో ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్టు పై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

ఈ సినిమా నుంచి వ‌స్తోన్న‌ అప్డేట్స్  సెన్షేష‌న‌ల్ గా మారుతున్నాయి. బాబి కూడా మెగాస్టార్ చిరంజీవి తో తెర‌కెక్కించిన వాల్తేరు వీర‌య్య సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. వీర‌య్య త‌ర్వాత బాబి బాల‌య్య తో చేస్తోన్న సినిమా కావ‌డంతో అంచ‌నాలు అయితే మామూలుగా లేవు. ఇక బాల‌య్య‌ను ఈ సినిమాలో ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా చూపిస్తున్నాడ‌న్న బ‌జ్ అయితే గ‌ట్టిగా ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ స‌ర్కిల్స్ లో వినిపిస్తోంది.

బాలయ్యపై యాక్షన్ సన్నివేశాలు దేనికదే హైలైట్ గా ఉంటున్న‌ట్టు గా తెలుస్తుంది. బాలయ్యపై ఒక థగ్ లాంటి గెటప్ లో గుర్రంపై బీచ్ దగ్గర విలన్స్ మూకతో క్రేజీ సీక్వెన్స్ ఉంద‌ట‌. ఇక సినిమాలో ఫైట్లు అయితే మామూలు రేంజ్‌లో ఉండ‌వ‌ట‌. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే నాగవంశీ, త్రివిక్రమ్ లు నిర్మాణం వహిస్తున్నారు. త్రివిక్ర‌మ్ భార్య సాయి సౌజ‌న్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే బాల‌య్య బాబి సినిమా షూటింగ్ త్వ‌ర‌గా పూర్తి చేయ‌నున్నారు. ఆ వెంట‌నే బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వం లో అఖండ 2 సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్నారు. ఇటు త‌న సినిమాలు సెట్ చేసుకుంటూ త‌న త‌న‌యుడు మోక్ష‌జ్ఞ డెబ్యూ మూవీ మీద కూడా గ‌ట్టిగా కాన్‌సంట్రేస‌న్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: