జానీ మాస్టర్‌ ను కాపాడుతున్న టాలీవుడ్‌ హీరో?

Veldandi Saikiran

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. ప్రస్తుతం ఇండస్ట్రీలో జానీ మాస్టర్ కి సంబంధించిన వార్త హాట్ టాపిక్ అవుతుంది. కొరియోగ్రాఫర్ గా రాణిస్తున్న జానీ మాస్టర్ కు ఊహించని షాక్‌ తగిలింది. అతని వద్ద పనిచేస్తున్న ఓ అమ్మాయి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై సంచలన ఆరోపణలు చేసింది. మాస్టర్ తనపై పలుమార్లు అత్యాచారాలు చేసినట్లు బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. జానీ మాస్టర్ రెండుసార్లు జాతీయ స్థాయిలో అవార్డులను దక్కించుకున్న ఏకైక కొరియోగ్రాఫర్ గా ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు.

జానీ మాస్టర్ పై శ్రేష్టి వర్మ అనే అమ్మాయి ఇలాంటి ఆరోపణలు చేస్తోంది. తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు గురి చేశాడు అంటూ తన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా తన ఇంటికి వచ్చి చాలాసార్లు బలాత్కారం చేశాడని పేర్కొంది. వాస్తవానికి ఏం జరిగిందనే విషయం తెలుసుకోవడానికి జానీ మాస్టర్ వద్ద మీడియా ప్రయత్నాలు చేసినప్పటికీ అతను అందుబాటులో ఉండడం లేదు. కనీసం అతను ఈ విషయంపై క్లారిటీగా స్పందించలేదు. మౌనంగా ఉంటున్నాడు. అతను ఎంతో ఇష్టపడి చేరిన జనసేన పార్టీ కూడా అతడిని ఈ విషయం తెలిసిన వెంటనే సస్పెండ్ చేసింది.

ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తన విధులకు దూరంగా ఉండాలని ఫిలించాంబర్ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం జానీ మాస్టర్ నెల్లూరులో ఉన్నాడనే సమాచారం మేరకు నార్సింగి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఈ కేసు నుంచి జానీ మాస్టర్ ను తప్పించడానికి ఓ టాలీవుడ్ హీరో సాయం చేస్తున్నాడని సమాచారం అందుతోంది. ఆ హీరో వల్లే వల్లే ఇవాళ్టి వరకు జానీ మాస్టర్‌ పోలీసులకు దొరుకలేదన్నారు.

ఇక ఈ విషయంపై జానీ మాస్టర్ భార్య సుమలత మీడియా ముందు మాట్లాడుతూ నా భర్త అలాంటి వ్యక్తి కాదని, కావాలని అతనిపై నెగిటివ్ గా ఆ అమ్మాయి ఇలా చెబుతుందని అన్నారు. ఆయన కొంతమందికి ఉపయోగపడే పనులే చేస్తారు కానీ ఇలాంటి పనులు నా భర్త ఎప్పటికీ చేయరు అంటూ జానీ మాస్టర్ భార్య మీడియా ముందు వెల్లడించారు. ఆయన మంచితనం, టాలెంట్ చూసి స్టార్ హీరోలు జానీ మాస్టర్ కు వరస అవకాశాలు ఇస్తున్నారు అంటూ గుర్తు చేశారు. ఇలాంటి సమయంలో నా భర్తపై ఇలా నెగిటివిటీని కావాలనే స్పెడ్ చేస్తున్నారంటూ జానీ మాస్టర్ భార్య చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: