'దేవర' ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆయుధ పూజ వాయిదా..!!

murali krishna
ఎన్టీఆర్ దేవర సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మూడు పాటలు, టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై భారీ అంచనాలు పెంచారు. ఇక దేవర పార్ట్ 1 సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది.ఈ క్రమంలో నాలుగో సాంగ్‌ రిలీజ్‌ డేట్‌ ప్రకటించారు. ఉదయం 11.07 గంటలకు ఆయుధ పూజ పాట విడుదల చేయనున్నట్లు పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. కానీ ఇంతలోనే దేవర టీమ్‌ మనసు మార్చుకుంది. ఆయుధ పూజను అంత ఈజీగా ముందుకు తీసుకురావడానికి మనసొప్పుకోవడం లేదంది. ఆయుధ పూజను మరింత ఘనంగా సెలబ్రేట్‌ చేసుకోవాలని, కనుక రేపు ఈ సాంగ్‌ రిలీజ్‌ చేయడం లేదని ఎక్స్‌ వేదికగా వెల్లడించింది.అయితే ఎదురుచూపులకు తగ్గ ఫలితాన్ని కచ్చితంగా అందిస్తామని పేర్కొంది. ఇది చూసిన కొందరు కనీసం ప్రోమో అయినా వదిలితే బాగుండేదని కామెంట్లు చేస్తున్నారు. రేపు రిలీజ్‌ చేయడం లేదంటే డైరెక్ట్‌గా థియేటర్‌లో రిలీజ్‌ చేస్తారేమోనని అభిప్రాయపడుతున్నారు. అయినా రిలీజ్‌ డేట్‌ ప్రకటించాక ఇలా మాట తప్పడం అస్సలు బాగోలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.దీంతో ఫ్యాన్స్ ఈ పాట కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మూడు పాటలతో మెప్పించిన దేవర మరి ఈ ఆయుధ పూజ సాంగ్ తో ఏ రేంజ్ లో మెప్పిస్తాడో చూడాలి.కాగా ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే ఇటీవలే దేవర షూటింగ్ పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమా విడుదల తర్వాత వార్ 2 సినిమా షూటింగ్లో పాల్గొన బోతున్నారు ఎన్టీఆర్. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలైంది.ఈ నేపథ్యంలో ఎన్టీఆర్, rrr తర్వాత గ్యాప్ తీసుకొని దేవర సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. మాస్ డైరెక్టర్ కొరటాల శివ  దర్శకత్వంలో ఈ మూవీ రాబోతుంది. గతంలో వీరిద్దరి కలయికలో జనతా గ్యారేజ్ మూవీ వచ్చి అఖండ విజయం సాధించింది. దీంతో దేవర ఫై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇదే సందర్బంగా సినిమా తాలూకా సాంగ్స్ , ట్రైలర్ , టీజర్ ఇలా ప్రతిదీ సినిమా ఫై ఆసక్తి పెంచడం తో ఎప్పుడెప్పుడు సినిమాను చూద్దామా అని అభిమానులు, సినీ లవర్స్ , సినీ ప్రముఖులు ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: