నందమూరి
బాలకృష్ణ తన కెరియర్లో ఎంతో మంది దర్శకులతో పని చేశారు. అలాగే ఎంతో మంది దర్శకులు
బాలయ్య కు బ్లాక్ బాస్టర్ విజయాలను కూడా అందించారు. కానీ ఓ ఇద్దరు దర్శకులు మాత్రం
బాలకృష్ణ కు అదిరిపోయే రేంజ్ విజయాలను అందించారు. వారెవరో కాదు బి.గోపాల్ ,
బోయపాటి శ్రీను.
బాలయ్య ,
బి గోపాల్ కాంబినేషన్లో మొత్తం ఐదు సినిమాలు వచ్చాయి. అందులో మొదటగా లారీ
డ్రైవర్ అనే
మూవీ వచ్చింది. ఈ
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వీరి కాంబోలో
రౌడీ ఇన్స్పెక్టర్ అనే
మూవీ వచ్చింది.