నితిన్ : చేతికి రానున్న రెండు ప్రాజెక్టులు.. విడుదల తేదీ పైనే ఫుల్ కన్ఫ్యూజన్..?

frame నితిన్ : చేతికి రానున్న రెండు ప్రాజెక్టులు.. విడుదల తేదీ పైనే ఫుల్ కన్ఫ్యూజన్..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో నితిన్ ఒకరు. నితిన్ ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా బోల్తా పడుతూ వస్తున్నాయి. కొంత కాలం క్రితం నితిన్ "మాచర్ల నియోజకవర్గం" అనే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది. కొంత కాలం క్రితమే ఈయన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

ఇక ప్రస్తుతం నితిన్ ఏక కాలంలో ఓ వైపు వెంకీ కుడుమల దర్శకత్వంలో రూపొందుతున్న రాబిన్ హుడ్ మూవీ లోనూ , మరో వైపు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న తమ్ముడు మూవీ లోనూ హీరో గా నటిస్తూ వస్తున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్లో కూడా చివరి దశకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ రెండు మూవీ ల షూటింగ్లో కూడా మరి కొంత కాలంలోనే పూర్తి కాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ రెండు సినిమాల షూటింగ్లు పూర్తి కావడానికి చాలా తక్కువ రోజులే ఉన్నా ఈ సినిమా విడుదల తేదీ పైనే కాస్త కన్ఫ్యూజన్ ఉన్నట్లు సమాచారం.

ఎందుకు అంటే ఈ రెండు సినిమాల షూటింగ్లో పూర్తి అయినప్పటికీ ఈ మధ్య కాలంలో వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాలు , భారీ క్రేజ్ ఉన్న సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. అలాగే చాలా మూవీలకు సంబంధించిన విడుదల తేదీలు కూడా అనౌన్స్ అయ్యి ఉన్నాయి. దానితో నితిన్ చేసిన రెండు మూవీ లు రెడీ అయిన కూడా ఏ తేదీలలో విడుదల చేయాలి అనే దానిపై మూవీ బృందం వారు కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి నితిన్ నటించిన ఈ రెండు సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: