మహేష్ -రాజమౌళి సినిమా.. షూట్ స్టార్ట్ అప్పుడేనట?

frame మహేష్ -రాజమౌళి సినిమా.. షూట్ స్టార్ట్ అప్పుడేనట?

praveen
ఇండియాలో లెజెండరీ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న వారిలో రాజమౌళి పేరు మొదటి స్థానంలో వినిపిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఒక సీరియల్ డైరెక్టర్ గా ప్రస్తానాన్ని మొదలుపెట్టిన రాజమౌళి ఇక ఇప్పుడు దేశం గర్వించదగ్గ డైరెక్టర్ గా ప్రస్తానాన్ని కొనసాగిస్తున్నారు. ఏకంగా టాలీవుడ్ సినిమాల పరిధిని చెరిపేస్తూ ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇక టాలీవుడ్ సినిమాలకు సినీ ప్రేక్షకులు అందరూ కూడా బ్రహ్మరథం పట్టేలా చేశారు రాజమౌళి. ఈ క్రమంలోనే బాహుబలి సినిమాతో ఎంతో సెన్సేషన్ సృష్టించిన రాజమౌళి.. త్రిబుల్ ఆర్ సినిమాతో వరల్డ్ హిట్ అందుకున్నారు అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే రాజమౌళితో సినిమా అంటే దాదాపు 1000 నుంచి 2000 కోట్ల వసూళ్లు ఖాయమని నిర్మాతలు కూడా నమ్ముతూ ఉన్నారు. దీంతో ఇక భారీ బడ్జెట్ పెట్టేందుకు కూడా సిద్ధమవుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం త్రిబుల్ ఆర్ లాంటి వరల్డ్ వైడ్ హీట్ తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్న మహేష్ బాబుతో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి.

 అమెజాన్ అడవుల్లో అడ్వెంచర్స్ నేపథ్యంలో ఈ సినిమా సాగిపోతుందని.. ఎన్నో రోజులుగా వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే హీరోలను ఎంతో డిఫరెంట్ గా చూపించి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తూ ఉంటాడు రాజమౌళి. ఈ క్రమంలోనే మహేష్ బాబు లాంటి హ్యాండ్సమ్ హీరోని ఎలా చూపించబోతున్నాడు అనే విషయం అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పేపర్లతో కూడిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో అని తెలుసుకునేందుకు అందరూ ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే దసరాకి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభమవుతుందని.. ఇక అప్పటినుండి మహేష్ బాబు మొత్తం ఈ సినిమాకి పరిమితమవుతాడని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: