ఆ అందమైన టాలీవుడ్ జంట సీక్రెట్ గా ప్లాన్ చేస్తోందట?
అలాంటి చర్చలే ఇపుడు సోషల్ మీడియాలో ఎక్కువగా జరుగుతున్నాయి. అందులో ముఖ్యమైన జంట నాగచైతన్య - శోభిత ధూళిపాల. అవును, సమంతను వదిలేసిన తరువాత నాగ చైతన్య సోలో లైఫ్ లీడ్ చేస్తున్నాడు. తాజాగా నాగచైతన్య - శోభిత ధూళిపాల ఎంగేజ్మెంట్ ను అతికొద్ది మంది అతిధుల మధ్య హీరో నాగార్జుల ప్లాన్ చేసిన సంగతి తెలిసినదే. ఇక వారి పెళ్లి కూడా ఎలాంటి ముందస్తు సమాచారం, ప్రచార హంగామా లేకుండా జరిగేందుకు నాగ్ ఫామిలీ రెడీ అయినట్టు వార్తలు వినబడుతున్నాయి.
ఇక ఈ జంట ఈ ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్న సంగతి విదితమే. కాగా వచ్చే ఏడాది మార్చిలో రాజస్థాన్లో వివాహం చేసుకోబోతున్నారని గుసగుసలు వినబడుతున్నాయి. బంధుమిత్రులు, ఇతరులను పిలవాల్సిన పని లేకుండా దీనిని ట్రెడిషనల్ గా సింపుల్ గా కానిచ్చేస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఇంతవరకు వీరి వివాహంపై అధికారిక ప్రకటన అంటూ ఏదీ లేదు. నాగచైతన్య కెరీర్ పరంగా బిజీ బిజీగా ఉన్నాడు. అదే సమయంలో శోభిత కూడా వరుస చిత్రాలతో కెరీర్ పరంగా దూసుకుపోతోంది. కాగా వారు తమ కమిట్ మెంట్లు పూర్తి కాగానే వివాహం షురూ చేస్తారని వినికిడి. ప్రస్తుతం అక్కినేని - ధూళిపాల కుటుంబాలు అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసే పనిలో ఉన్నట్టు మాత్రం వార్తలు వినిపిస్తున్నాయి.