సిద్ధార్థ్ అదితి పెళ్లిలో బయటపడ్డ భయంకరమైన నిజం..?

Pandrala Sravanthi
 సౌత్ హీరో సిద్ధార్థ్ అదితి రావు హైదరి పెళ్లి చేసుకున్న ఫోటోలు నిన్న సడన్ గా వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ ఎవరికి తెలియకుండా ఈ జంట సీక్రెట్ గా పెళ్లి చేసుకోవడం ఏంటి అని షాక్ అయ్యారు. అయితే ఇప్పటికే నిశ్చితార్థం కూడా రహస్యంగా చేసుకున్నారు. అదితి రావు హైదరి ఫ్యామిలీకి ఎంతో సెంటిమెంట్ గా వస్తున్న వనపర్తి శ్రీరంగాపురం రంగనాయక స్వామి ఆలయంలో సిద్ధార్థ్ అదితి రావు హైదరీ కుటుంబ సభ్యుల సమక్షంలో. అయితే వీరికి నిశ్చితార్థం జరిగిన విషయాన్ని చాలా రోజుల తర్వాత బయట పెట్టేశారు. అయితే తాజాగా వీరు పెళ్లి చేసుకున్న విషయాన్ని కూడా రహస్యంగానే ఉంచేశారు.  నిన్న అనగా సెప్టెంబర్ 15న వీరి పెళ్లి జరిగినట్టు పెళ్లికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. అయితే అందరికీ తెలియని ఒక షాకింగ్ నిజం ఏంటంటే..వీరి పెళ్లి జరిగి దాదాపు రెండు నెలలు అవుతుందని. 

కానీ ఈ విషయాన్ని తాజాగా బయటపెట్టారంటూ సోషల్ మీడియా లో ఓ టాక్ వినిపిస్తుంది. అయితే రెండు నెలల ముందు జరిగిన వివాహాన్ని ఎందుకు దాచిపెట్టారో తెలియడం లేదు అని చాలామంది అదితి రావు హైదరి, సిద్ధార్థ్ ల అభిమానులు మాట్లాడుకుంటున్నారు. అయితే వీరిద్దరూ సరైన కారణం ఏంటో చెప్పాలని చాలామంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.మరి నిజంగానే ఈ జంట రెండు నెలల క్రితమే  రహస్యంగా పెళ్లి చేసుకున్నారా.. లేక సెప్టెంబర్ 15 నే పెళ్లి చేసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది.

ఏది ఏమైనప్పటికీ వీరి పెళ్లి,ఎంగేజ్మెంట్ మాత్రం ఇంత రహస్యంగా చేసుకోవడానికి అసలు కారణం ఏంటో అని చాలామంది నెటిజన్స్ భావిస్తున్నారు. అయితే ఈ జంట కి పరిచయం ఏర్పడింది మహాసముద్రం సినిమా సమయంలో.. ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన మహాసముద్రం సినిమాలో శర్వానంద్,అదితి రావు హైదరి, సిద్ధార్థ్ లు నటించారు. ఈ సినిమా సమయంలోనే సిద్ధార్థ్ అదితి రావు హైదరి మధ్య ప్రేమ చిగురించి అది కాస్తా పెళ్లి వరకు దారి తీసింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: