సునీల్ భార్య ఏం చదువుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారంతే..?
సునీల్‌కి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ చేయాలనే కోరిక ఉండేది. కానీ ఆయన స్నేహితుడు, ప్రముఖ రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సలహా మేరకు కామెడీ చేయడం మొదలుపెట్టారు. కామెడీలో సునీల్‌కి ఎంతో పేరు వచ్చింది. ఆయన నటించిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. కామెడీ మాత్రమే కాదు, హీరోగా, డాన్సర్‌గా కూడా సునీల్ చాలా బాగా రాణించాడు. అందాల రాముడు అనే సినిమాలో మొదటిసారిగా హీరోగా నటించారు.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాద రామన్న సినిమా బాగా హిట్ అయిన తర్వాత సునీల్ హీరోగా చాలా సినిమాలు చేశారు. పూల రంగడు, మిస్టర్ పెళ్లి కొడుకు, తడాఖా, భీమవరం బుల్లోడు, కృష్ణాష్టమి, జక్కన్న, ఈడు గోల్డ్ ఏహే, ఉంగరాల రాంబాబు లాంటి సినిమాల్లో నటించాడు. కానీ ఈ సినిమాలన్నీ అంతగా హిట్ కాలేదు. అందుకే తిరిగి కామెడీ చేయడం మొదలుపెట్టారు.
సునీల్ ఇప్పుడు కమెడియన్‌గా లేదా హీరోగా కంటే విలన్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. పుష్ప సినిమాలో మంగళం శ్రీను అనే విలన్ పాత్ర చేసి చాలా పేరు తెచ్చుకున్నారు. ఇక సునీల్ వ్యక్తిగత జీవితం గురించి చాలా మందికి తెలియదు. ఆయన పెద్దలు నిశ్చయించిన అమ్మాయిని అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆయన భార్య పేరు శ్రుతి. ఆమె పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. వీరికి ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. సునీల్ శృతి దంపతులు చాలా అన్యోన్యంగా ఉంటారు. శృతి సునీల్ కి చాలా బాగా సపోర్ట్ అందిస్తారని సన్నిహితులు చెబుతుంటారు.