యంగ్ హీరో శ్రీ సింహ, కమెడియన్ సత్య, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం 'మత్తు వదలరా 2'. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ కామెడీ ఎంటర్ ట్రైనర్.తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. థియేటర్లలో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తోంది. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ వేడుకలో దర్శకుడు రితేష్ రానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.మత్తు వదలరా2’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించడంతో సీక్వెల్ గురించి అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు దర్శకుడు రితేష్ రానా. ‘మత్తు వదలరా 3’ తప్పకుండా ఉంటుందన్నారు. “మత్తు వదలరా 2 సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తే సంతోషంగా ఉంది. ఈ సినిమాకు కొనసాగింపు ఉంటుంది. కచ్చితంగా ‘మత్తువదలరా 3’ వస్తుంది. ఎప్పుడు వస్తుంది అనేది కచ్చితంగా చెప్పలేను. కానీ, తప్పకుండా వస్తుంది” అని చెప్పుకొచ్చారు. ఇప్పటికే వచ్చిన రెండు సినిమాలు మంచి హిట్ అందుకోవడంతో మూడో భాగంపై ప్రేక్షకులలో మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అంతేకాదు, ‘మత్తు వదలరా 2’ సినిమాకు కొనసాగింపుగా సీక్వెల్ వస్తుందా? లేదంటే కొత్త స్టోరీతో తెరకెక్కిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.దీంతో అభిమానుల్లో ‘మత్తు వదలరా 3’ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా.
అందులో ఎలాంటి కథతో వస్తారా అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ చిత్రాన్ని చూసి ప్రేక్షకులు హాయిగా నవ్వుకోవడం ఆనందన్నిస్తోoదని హీరో శ్రీ సింహ తెలిపారు. ఈ మూవీ తనకేంతో ప్రత్యేకమని, పేరు తో పాటు విజయాన్ని ఇచ్చిందని కమెడియన్ సత్య పేర్కొన్నారు.అయితే తాజాగా ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమాలో రాత, తీత, కోత, మోత, ప్రతీది చక్కగా బ్యాలెన్స్ చేశారంటూ దర్శకుడు రితేష్ రానాను చిరంజీవి అభినందించారు. ఈ మధ్యకాలంతో తనను ఎక్కువగా నవ్వించిన సినిమా ఇదే అన్నారు. ఈ సినిమాలో భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరికీ అభినందనలు చెప్పారు. అటు ఈ సినిమా చూసి నవ్వుల్లో మునిగిపోయామని మహేష్ బాబు చెప్పుకొచ్చారు. ఈ సినిమా చాలా ఎంటర్ టైనింగ్ గా ఉందన్నారు. వెన్నెల కిషోర్ కనిపించినంత సేపు తన కూతురు సితార నవ్వు ఆపుకోలేక పోయిందన్నారు. సత్య కూడా అద్భుతంగా నవ్వించాడని చెప్పారు. ఈ సినిమాలోని ప్రతి యాక్టర్ అద్భుతంగా అలరించారని చెప్పారు. అందరికీ అభినందనలు చెప్పారు.