SIIMA Awards 24: ఉత్తమ నటుడు, తెలుగు మూవీ ఏదంటే?
కాగా ఈ వేదికపై హీరోయిన్లు ట్రెండీ ట్రెండీ దుస్తులతో అదరగొట్టేశారు. ఈ క్రమంలోనే అవార్డుల వేడుక సందర్భంగా పలువురు నటీమణులు తమ ప్రదర్శనల్ని ప్రదర్శించారు. శ్రేయ, ఫరియా అబ్దుల్లా, నేహాశెట్టి, శాన్వీ తదితరులు తమ ప్రదర్శనలతో సైమా అవార్డుల ఫంక్షన్ కి కొత్త కళని తీసుకొచ్చారు. ఇకపొతే తెలుగు సినిమాకు సంబంధించి ఎవరెవరికి అవార్డులు వచ్చాయన్నది మనం ఒకసారి గమనిస్తే.. ఉత్తమ చిత్రంగా బాలక్రిష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన "భగవంత్ కేసరి" మూవీ నిలవగా ఉత్తమ నటుడిగా దసరా మూవీలో నటించిన హీరోనానికి అవార్డు లభించింది. అదేవిధంగా అదే సినిమాకి గాను ఉత్తమ నటిగా కీర్తి సురేశ్ కు అవార్డు సొంతమైంది.
ఇక కన్నడ చిత్ర పరిశ్రమ విషయానికొస్తే... ‘సప్తసాగరదాచె ఎల్లో - ఎ’ మూవీలో నటించిన రక్షిత్ శెట్టికి ఉత్తమ నటుడి అవార్డు సొంతం కాగా.. ఉత్తమ నటిగా రుక్మీణీ వసంత్ అవార్డు అందుకున్నారు.
‘సైమా’ 2024 అవార్డుల విజేతలు:
ఉత్తమ నటుడు – నాని (దసరా)
ఉత్తమ నటి – కీర్తి సురేష్ (దసరా)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్) – ఆనంద్ దేవరకొండ (బేబీ)
ఉత్తమ నటి (క్రిటిక్స్) – మృణాల్ ఠాకూర్ (హాయ్ నాన్న)
ఉత్తమ దర్శకుడు – శ్రీకాంత ఓదెల (దసరా)
ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్)- సాయి రాజేష్ (బేబీ)
ఉత్తమ తెలుగు చిత్రం- భగవంత్ కేసరి ఉత్తమ గాయకుడు- రామ్ మిరియాల (బలగం)
ఉత్తమ సహాయ నటుడు – దీక్షిత్ శెట్టి (దసరా)
ఉత్తమ సహాయ నటి- కియారా ఖన్నా (హాయ్ నాన్నా)
ఉత్తమ నూతన దర్శకుడు – శౌర్యువ్ (హాయ్ నాన్న)
ఉత్తమ నూతన నటుడు – సంగీత్ (మ్యాడ్)
ఉత్తమ ప్రామిసింగ్ యాక్టర్ – సుమంత్ ప్రభాస్ (మేం ఫేమస్)
ఉత్తమ నూతన నటి – వైష్ణవి (బేబీ)
ఉత్తమ సంగీత దర్శకుడు – హేషమ్ అద్బుల్ వహాబ్ (హాయ్ నాన్న)
ఉత్తమ సాహిత్యం- అనంత్ (బేబీ)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – భువన్ గౌడ (సలార్)
ఉత్తమ హాస్యనటుడు – విష్ణు (మ్యాడ్)
ఉత్తమ పరిచయ నిర్మాత: వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ (హాయ్ నాన్న)