అఖిల్ పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి కారణం ఆ మెగా హీరోనా.?

frame అఖిల్ పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి కారణం ఆ మెగా హీరోనా.?

Pandrala Sravanthi
అక్కినేని అఖిల్ శ్రియా భూపాల్ ల ఎంగేజ్మెంట్ అప్పట్లో ఓ సంచలనం.. అసలు ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేని శ్రీయ భూపాల్ ని  అఖిల్ ప్రేమించడం అందరికీ షాకింగ్ గా అనిపించింది. ఎందుకంటే అసలు వీరి పరిచయం ఎక్కడ జరిగింది? వీరు ఎలా కలిశారు అని చాలామందిలో ఒక అనుమానం అయితే ఉండేది.ఇక ఎంతో గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న అక్కినేని అఖిల్ శ్రియా భూపాల్ లు పెళ్లి మరికొద్ది రోజులు ఉంది అనగా ఎంగేజ్మెంట్ ని రద్దు చేసుకొని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. అయితే వీరి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవ్వడం వెనుక అనేక కారణాలు తెరమీద వినిపించాయి. కొంతమందేమో అఖిల్ క్యారెక్టర్ మంచిది కాదని శ్రియా భూపాల్ వదిలేసింది అంటే.. మరి కొంతమందేమో శ్రీయా భూపాల్ క్యారెక్టర్ గురించి వార్తలు రాశారు.అయితే ఈ వార్తతో పాటు మరో వార్త కూడా మీడియాలో హాట్ టాపిక్ అయింది.


 అదేంటంటే శ్రియా భూపాల్ అక్కినేని అఖిల్ ల పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి ఆ హీరో కారణమనే రూమర్స్ వినిపించాయి  ఇక ఆ హీరో ఎవరో కాదు అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్.. అయితే సోషల్ మీడియాలో అల్లు శిరీష్ తో  అక్కినేని అఖిల్ మాజీ లవర్ దిగిన ఫొటోస్ కొన్ని చక్కర్లు కొడతాయి. అయితే ఈ ఫోటో చూస్తే అక్కినేని అఖిల్ మాజీ లవర్ తో అల్లు శిరీష్ కి ఎలాంటి సంబంధం ఉంది అని చాలామంది భావిస్తారు.అయితే శ్రియా భూపాల్ అల్లు శిరీష్ ఇద్దరు స్నేహితులట. అంతేకాకుండా శ్రియా భూపాల్, ఉపాసన కజిన్ అనే సంగతి కూడా మనకు తెలిసిందే.

 

అలా ఉపాసనని రాంచరణ్ పెళ్లి చేసుకోవడంతో అల్లు శిరీష్ కి శ్రియా భూపాల్ కి మధ్య ఉన్న బాండింగ్ మరింత పెరిగింది. కానీ వీరిద్దరి మధ్య చెడుగా అర్థం చేసుకోవాల్సిన రిలేషన్ ఏమీ లేదు.కానీ అఖిల్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యాక అల్లు శిరీష్ తో శ్రీయా భూపాల్ ఉన్న ఫోటోలు నెట్టింట చక్కర్లు కొట్టడంతో అక్కినేని అఖిల్ శ్రియా భూపాల్ ల ఎంగేజ్మెంట్ క్యాన్సల్ అవ్వడానికి, వీరి పెళ్లి జరగకపోవడానికి కారణం అల్లు శిరీషే అనే వార్తలు మీడియా మొత్తం కోడై కూసాయి. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: