రాజేంద్ర ప్రసాద్ : ఆ సీన్ లో ఎన్టీఆర్ ఎంతో ఎమోషనల్ అయ్యాడు.. తనని అలా చూడలేకపోయా..!!

murali krishna
నందమూరి తారక రామారావు కుటుంబం నుంచి మూడో తరం నటుడిగా ఎంట్రీ ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్.నటన, ఆహార్యం, వాక్చాతుర్యం ఇలా అన్నింటిని తాత నుంచి పుణికి పుచ్చుకున్నారు జూనియర్.ఈ తరంలో నవరసాలను అద్భుతంగా పలికించగల సింగిల్ టేక్‌లో ఎలాంటి టఫ్ సీన్‌ను అయినా చేయగల అరుదైన నటుడు. తాతయ్య ఒడిలోనే నటనలో ఓనమాలు నేర్చుకున్న ఎన్టీఆర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన బాలరామాయణంలో అద్భుతంగా నటించి ప్రశంసలు దక్కించుకున్నారు.క్లాసికల్ డ్యాన్సర్‌గా దేశంలోని పలు ప్రదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు ఎన్టీఆర్.అనంతరం చదువుపై దృష్టి పెట్టిన ఆయన నిన్ను చూడాలని చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తొలి మూవీ ఆకట్టుకోకపోయినా నిరుత్సాహాపడకుండా ప్రయత్నించారు. ఈ క్రమంలో స్టూడెంట్ నెం.1, సింహాద్రి, ఆది సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్ కావడంతో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ శిఖరాగ్రాన్ని తాకింది.
ఇదిలా వుండగా సీనియర్ నటుల నుంచి అప్ కమింగ్ యాక్టర్స్ వరకు చాలా మంది తారక్ ను అభిమానిస్తుంటారు. ఇక తారక్ గురించి చాలా మంది చాలా విషయాలు చెప్తూ ఉంటారు. ఆయన అందరితో ఎంత స్నేహంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద హీరో అనే గర్వం ఎక్కడా చూపించరు ఎన్టీఆర్. చిన్న చిన్న ఆర్టిస్ట్ లతో కూడా ఎంతో కలివిడిగా మాట్లాడుతుంటాడు . ఎన్టీఆర్ గురించి సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
గతంలో ఓ ఇంటర్వ్యూలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తారక్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్నీ పంచుకున్నారు.ఎన్టీఆర్‌తో కలిసి రాజేంద్రప్రసాద్ నాన్నకు ప్రేమతో  సినిమా చేశారు. ఈ సినిమా లో రాజేంద్ర ప్రసాద్ ఎన్టీఆర్ తండ్రిగా నటించారు. ఈ సినిమా కు సుకుమార్ దర్శకత్వం వహించారు.ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో ఓ ఇంటర్వ్యూలో రాజేంద్ర ప్రసాద్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ తారక్ ఎవరు.. పెద్దాయన మనవడు అంటే నాకు ఏమవుతాడో అందరికి తెలుసు. ఇంతవరకు ఎక్కడ బయట చెప్పలేదు. నాన్నకు ప్రేమతో క్లైమాక్స్ లో నేను నవ్వుతూనే చనిపోతాను.ఆ సీన్ లో నటిస్తూ ఎన్టీఆర్ నన్ను పట్టుకొని గంటసేపు ఏడ్చాడు.మేము ఎంతో ఎమోషనల్ అయ్యాము.ఎన్టీఆర్ ను మేము ఓదార్చలేకపోయాం.నా వల్ల కాలేదు. అయ్యో నాన్న నేను ఇక్కడే ఉన్నాగా అని చెప్పిన కూడా తారక్ కంట్రోల్ చేసుకోలేకపోయాడు.ఎంతో ఎమోషనల్ అయ్యి మేమిద్దరం యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మా రిలేషన్ కూడా అలాంటిదేగా అని అన్నారు రాజేంద్ర ప్రసాద్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: