వామ్మో: ఆ చెడ్డ అలవాటు వల్ల.. రోజు సూర్య, జ్యోతిక గొడవ.. ఏమిటంటే..?

frame వామ్మో: ఆ చెడ్డ అలవాటు వల్ల.. రోజు సూర్య, జ్యోతిక గొడవ.. ఏమిటంటే..?

Divya
హీరో సూర్య, జ్యోతిక జోడి గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఎలాంటి విమర్శలకు కూడ తావు ఇవ్వకుండా తమ పని తాము చేసుకుంటూ వెళుతూ ఉంటారు.. మొదట కాక్క కక్కా అనే చిత్రం ద్వారా నటిస్తున్న సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారట. అలా 2006లో ఇరువురు కుటుంబ సభ్యులను ఒప్పించి మరి వివాహం చేసుకున్నారు. వివాహమైన తర్వాత జ్యోతిక సినిమాలకు గ్యాప్ ఇవ్వడంతో వీరికి దియా,దేవ్ అనే పిల్లలు జన్మించారు. వీరిద్దరూ పెద్దయిన తర్వాత జ్యోతిక మళ్లీ సినిమాలలో రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది.

జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి బిజీ యాక్టర్ గా మారిపోయింది. వరుసగా పలు సినిమాలలో కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నప్పటికీ సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతోంది. ఇటీవలే విజయ్ నటించిన గోట్ చిత్రంలో కూడా విజయ్ భార్యగా నటించడానికి మొదట చిత్ర బృందం సంప్రదించారట.కానీ అందులో తన కథకు బలమైన స్కోప్ లేకపోవడంతో నిరాకరించిందట. ఇవే కాకుండా చాలా చిత్రాలను రిజెక్ట్ చేసింది జ్యోతిక. అటు హిందీలో కూడ ఇమే నటించినా సైతాన్ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది.

మరొకవైపు జ్యోతిక భర్త సూర్య కూడా కంగువా అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సీరుతై శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇలా ఇద్దరు కూడా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈరోజున తమ 18వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా సోషల్ మీడియాలో సూర్య, జ్యోతికకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో జ్యోతిక తన భర్త చేసే పనుల వల్ల తాను భరించలేకపోయానని తెలిపింది. అదేమిటంటే.. ముఖ్యంగా సూర్యలో తనకు ఇష్టమైన విషయాలను తెలుపుతూ.. స్నేహపూర్వకంగానే తనతో ఉండడమే కాకుండా తనిని చాలా గౌరవిస్తారని తెలిపింది జ్యోతిక.. సూర్య విషయంలో భరించలేనటువంటి ప్రశ్న ఏమిటి అని అడగగా.. అందుకనే సూర్య ఎక్కువగా బాత్రూంలోని సమయాన్ని గడుపుతారని నేను ఆ విషయాన్ని మాత్రం సహించలేను.. ఈ విషయం పైన ప్రతిరోజు ఉదయం ఇద్దరి మధ్య గొడవ జరుగుతూనే ఉంటుందంటూ నవ్వుతూ తెలియజేసింది జ్యోతిక.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: