రజనీకాంత్ కెరీర్ ని మార్చేసిన మరో బ్లాక్ బాస్టర్ మూవీ రీ రిలీజ్..!
విజయ్, అజిత్ వంటి స్టార్ హీరోలు నటించిన చిత్రాలను విడుదల చేశారు. ఇప్పుడు తాజాగా సూపర్ సార్ రజనీకాంత్ సినీ కెరియర్ని మార్చేసిన చిత్రం శివాజీ ఈ సినిమాతో భారీ క్రేజ్ అందుకున్నారు. ఈ సినిమాని ఇప్పుడు రీ రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలోని ఈ సినిమా 2007లో విడుదల భారీ విజయాన్ని అందుకున్నది. ఇందులో శ్రియ హీరోయిన్గా నటించగా కీలకమైన పాత్రలో సుమన్ నటించారు. కోలీవుడ్ సినీ పరిశ్రమలోనే మొదటిసారిగా 100 కోట్ల క్లబ్ లోకి చేరిన చిత్రం శివాజీగా నిలిచింది.
ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ కూడా ఈ సినిమాకి ప్లస్ అయ్యింది. అంతేకాకుండా 100వ సినిమా కూడా ఏఆర్ రెహమాన్ కి మ్యూజిక్ పరంగా శివాజీ సినిమానే.. సుమారుగా 17 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 20వ తేదీన 4K వర్షన్ లో రీ రిలీజ్ చేయబోతున్నారు. టికెట్ కేవలం 99 రూపాయలు మాత్రమే ఉండబోతుందట. 2012లో రజనీకాంత్ బర్తడే సందర్భంగా త్రీడీ వర్షం లో విడుదల చేశారు.. అందులో 30 నిమిషాల పాటు ఈ సినిమా కత్తిరించినట్లు సమాచారం. అప్పట్లో 3D డాల్బీ అట్మాస్ ప్లాట్ఫారంతో ప్రారంభించబడిన మొట్టమొదటి ఇండియన్ చిత్రంగా శివాజీ సినిమా నిలిచింది. మరి రీ రిలీజ్ లో సెప్టెంబర్ 20న ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.