నిహారిక వ‌ర్సెస్ సుశ్మిత‌... మెగా వార‌సురాళ్ల మ‌ధ్య ఏం జ‌రుగుతోంది..?

frame నిహారిక వ‌ర్సెస్ సుశ్మిత‌... మెగా వార‌సురాళ్ల మ‌ధ్య ఏం జ‌రుగుతోంది..?

RAMAKRISHNA S.S.
టాలీవుడ్ లో అతిపెద్ద కాంపౌండ్ అయిన మెగా కాంపౌండ్ లో తాజాగా కొత్త నిర్మాతలు పుట్టుకొచ్చారు. పైగా ఇద్దరు మహిళలు మాత్రమే కావటం విశేషం. వాళ్లే నిహారిక కొణిదెల .. సుస్మిత కొణిదెల. అయితే వీళ్ళలో ఎవరికి మెగా హీరోలు ముందుగా అవకాశాలు ఇవ్వబోతున్నారు ? అన్నదానిపై ఇప్పుడు ఆసక్తికర చర్చ‌ నడుస్తోంది. పింక్ ఎలిఫెంట్ స్థాపించింది నిహారిక ... ముందుగా ప‌లు టివీ షోలు, వెబ్ సిరీస్ల‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. త‌ర్వాత హీరోయిన్‌గాను త‌న అదృష్టం ప‌రిక్షించుకుంది. అయితే న‌టిగా నిహారిక‌కు స‌రైన స‌క్స‌స్ అంద‌లేదు. ఆ క్ర‌మంలో రీ ఎంట్రీతో నిర్మాతగా మ‌రోసారి కెరీర్ మొదలు పెట్టింది. తాజాగా కమిటీ కుర్రాళ్ళు సినిమాతో నిర్మాతగా సక్సెస్ అయింది.
ఇప్పుడు నిహారిక సినిమా తీస్తానంటే మెగా హీరోలు ఎవరైనా కాల్ సీట్లు ఇస్తారా ? చిరంజీవి - పవన్ కళ్యాణ్ - చరణ్ - బన్నీ - వరుణ్ తేజ్ - సాయి తేజ్ - వైష్ణవ - శిరీష్ ఇలా చాలామంది హీరోలు ఉన్నారు. ఈ కాంపౌండ్ లో బన్నీని మినహాయిస్తే వీళ్లలో ఎవరితో అయినా నిహారిక సినిమా చేయవచ్చు. నిహారిక మాత్రం తన టార్గెట్ పవన్ కళ్యాణ్ అంటుంది. ప్రస్తుతానికి నిహారిక చిన్న సినిమాలు చేయటానికి ఆసక్తి చూపుతోంది. ఇక చిరంజీవి కుమార్తె సుష్మిత విషయానికి వస్తే గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ స్థాపించింది.
ఆమె కూడా వెబ్ కంటెంట్ తో నిర్మాతగా కెరియర్ ప్రారంభించింది. తండ్రి చిరంజీవితో సినిమా ప్లాన్ చేసినా ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. ఈ సినిమాకు కురసాల కళ్యాణకృష్ణ ను దర్శకుడు అనుకున్నారు. అయితే ఈ ఇద్దరు నిర్మాతగా తమ ప్రయత్నాలు తమ చేస్తున్న మెగా కాంపౌండ్ లో స్టార్ హీరోలతో సినిమాలు చేయలేదు. రాబోయే రోజులలో వీళ్ల‌లో ముందుగా ఎవరు తమ కాంపౌండ్ నుంచి స్టార్ హీరోతో సినిమా చేసి సూపర్ హిట్ కొట్టి సక్సెస్ అవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: