టాలీవుడ్ ఇండస్ట్రీలోని అత్యంత భారీ బడ్జెట్ సినిమాలలో దేవర ఒకటి కాగా ఎన్నో ప్రత్యేకతలతో ఈ
సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దేవర ట్రైలర్ నచ్చిందని 50% ప్రేక్షకులు చెబుతుండగా మిగిలిన వాళ్లు మాత్రం ఈ
సినిమా ట్రైలర్ తమకు నచ్చలేదని చెబుతున్నారు.300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో దేవర తెరకెక్కగా ఈ సినిమాకు దాదాపుగా 350 కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందని విడుదలకు ముందే నిర్మాతలు సేఫ్ అయ్యారని తెలుస్తోంది. అయితే దేవర ట్రైలర్ చూసిన ప్రేక్షకులను కథ కథనం విషయంలో ఎన్నో సందేహాలు వేధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే
సినిమా క్లైమాక్స్ లో
ఎన్టీఆర్ రెండు పాత్రలకు సంబంధించి వచ్చే ట్విస్ట్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని ప్రేక్షకులు ఏమాత్రం ఆ ట్విస్ట్ ను ఊహించే అవకాశం అయితే లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
పోకిరి సినిమా రేంజ్ లో ఈ
సినిమా ట్విస్ట్ ఉండబోతుందని
ఇండస్ట్రీ వర్గాల భోగట్టా.ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టు, అభిమానులను షాక్‌కి గురి చేస్తుందని అంటున్నారు..
సినిమా ట్రైలర్‌ని చూసి నిరాశ చెందిన అభిమానులు,
సినిమా చూశాక
బ్లాక్ బస్టర్ బొమ్మ చూశామనే సంతృప్తితో ఇంటికి వెళ్తారని అంటున్నారు. మరీ ముఖ్యంగా
ఎన్టీఆర్ చెప్పినట్టుగా ఆఖరి 40 నిమిషాలు సాగే యాక్షన్ ఎపిసోడ్స్, సినిమాకే హైలైట్ అని అంటున్నారు.ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటో తెలుసా?
తండ్రి దేవర పేరుతో భయస్తుడిగా నటిస్తూ.. కొడుకే ఊచకోత కోస్తుంటాడట. సినిమాలో రివీల్ అయ్యే ఈ ట్విస్ట్ కు మైండ్ బ్లాక్ అవుతుందట. ప్రస్తుతం ఈ న్యూస్ పరిశ్రమలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది.ఇదిలా ఉండగా.. కొడుకే దేవర అయితే.. ఇంతకీ దేవర ఉన్నాడా? లేడా? అనే కొత్త సందేహం అభిమానుల్లో రేకెత్తుతోంది. ఇందులో
తారక్ డ్యూయెల్ రోల్ చేయడం లేదా? అంటూ మరికొందరు సోషల్
మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. మేకర్స్ కావాలనే ఈ సస్పెన్స్ ను క్రియేట్ చేశారా? అంటున్నారు అభిమానులు. ఇది అధికారికంగా తెలిసిన న్యూస్ కాకపోయినప్పటికీ..
పరిశ్రమ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
తారక్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో ఇలాంటి బ్లాస్టింగ్ ట్విస్ట్ లు ఉంటే.. ఫ్యాన్స్ తో పాటుగా అభిమానులకు కూడా ఫుల్ కిక్కెక్కుతుంది. దేవరలో ఈ ట్విస్ట్ ఉంటే..
టాలీవుడ్ లో
పోకిరి తర్వాత మళ్లీ అలాంటి ట్విస్ట్ ఇదే అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి దేవర పేరుతో కొడుకే విధ్వంసం సృష్టిస్తున్నాడా? అన్నది తెలియాలంటే..
సెప్టెంబర్ 27 దాక ఆగాల్సిందే.