దిల్ రాజు తాజాగా మాట్లాడుతూ.. ఎవడు సినిమాలో ఒక కీలకమైన పాత్ర ఉంది. దానిని ఎవరో ఒక మంచి ఈమేజ్ ఉన్న నటుడు చేయాలి. ఇక
సినిమా దర్శకుడు
వంశీ ఖచ్చితంగా ఆ పాత్రను
అల్లు అర్జున్ చేయాలి అని పట్టు పట్టుకొని కూర్చున్నాడు. వేరే ఆప్షన్ లేదు.. అతనే కావాలి అని అన్నాడు. ఇక తర్వాత నేను
అరవింద్ గారిని కలిశాను. స్టోరీ మొత్తం చెప్పాను. ఆయనకు బాగా నచ్చింది. ఆ తర్వాత
బన్నీ కూడా విన్నాడు. ఆయనకు కూడా ఆ స్టోరీ నచ్చింది. అందులోని అతని పాత్ర కూడా బాగా నచ్చింది. దానితో వెంటనే చేస్తాను అన్నాడు.
ఇక ఆ తర్వాత
చిరంజీవి కూడా
అల్లు అర్జున్ పోర్షన్ కి సంబంధించిన స్టోరీని విన్నాడు. దానికి
అల్లు అర్జున్ చాలా బెటర్ అని ఆయన కూడా ఆలోచనకు వచ్చాడు. అలాగే వారంతా కూడా
రామ్ చరణ్ ,
అల్లు అర్జున్ ఇద్దరు ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు. అలా ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఈ పాత్రలో కనబడితే జనాలకు కూడా బాగా కనెక్ట్ అవుతారు. అలాంటి పాత్రను
అల్లు అర్జున్ చేయడం సరైన నిర్ణయం అని అందరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని దిల్ రాజు తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.