దేవర: బాబాయ్ వారసుడితో.. ఎన్టీఆర్ కు దెబ్బేనా..?

Divya
దేవర సినిమా పేరు ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కువగా వినిపిస్తోంది. అందుకు కారణం దేవర నిన్నటి రోజున ట్రైలర్  విడుదలైనప్పటి నుంచి మరింత ఎక్కువగా ఈ పేరు వినిపిస్తోంది. కొంతమంది దేవర సినిమా ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించలేదని విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం జూనియర్ ఎన్టీఆర్ హవా తగ్గిపోయిందని బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వడం వల్లే ఎన్టీఆర్ హవా తగ్గిపోయిందనే విధంగా కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఈ విషయాన్ని వైరల్ గా చేస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులను మాత్రం దేవర ట్రైలర్ ఆకట్టుకుందట.

దేవర సినిమా విడుదలైన ట్రైలర్ 100 K లైక్ సాధించినటువంటి ట్రైలర్లలో 9 వ స్థానంలో నిలిచిపోవడం జరిగింది. అయితే స్టార్ హీరో అయ్యిండి కూడ ఇంతటి చివరి స్థానంలో నిలవడంతో అభిమానులు కాస్త నిరుత్సాహంతో ఉన్నారు. దేవర సినిమా అనుకున్నంత స్థాయిలో స్పీడ్ గా ప్రేక్షకులలోకి వెళ్లలేకపోతోంది. ఎన్టీఆర్ అభిమానులు తప్ప మిగిలిన వారు ఎవరు కూడా దేవర చిత్రాన్ని పట్టించుకోలేదనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టిడిపి పార్టీకి ఎన్టీఆర్ సపోర్ట్ చేయలేదని.. అటు నందమూరి కుటుంబంతో ఎన్టీఆర్ మాట్లాడలేదనే విధంగా వార్తలు వినిపిస్తూ ఉండడంతో ఈ రెండిటి ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్ ని దూరం పెట్టినట్లుగా సమాచారం.

అలాగే ప్రస్తుతం బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ  కూడ ఎంట్రీ ఇవ్వడంతో  అందరూ కూడా మోక్షజ్ఞ వైపే ఎక్కువగా చూస్తున్నారట. ఇటీవలే మోక్షజ్ఞ సినిమాకి సంబంధించి అధికారికంగా పోస్టర్ను కూడా విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. మోక్షజ్ఞ పోస్టర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన ఎన్టీఆర్ దేవర సినిమా ట్రైలర్ కి రెస్పాన్స్ చాలానే తగ్గిపోయింది.. ముఖ్యంగా టిడిపి కేడర్ కూడా ఎన్టీఆర్ ని వ్యతిరేకిస్తున్నాడట. వైసీపీ పార్టీకి పరోక్షంగానే సపోర్ట్ చేస్తున్నారనే విధంగా ఎన్టీఆర్ మీద ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే దేవర సినిమాని ఒక వర్గం వారు పట్టించుకోలేదని విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ విషయాలను కొట్టి పారేస్తున్నారు.అయితే అభిమానులు నిరుత్సాహంతో ఉన్నారని తెలుసుకున్న దేవర టీమ్ మరో ట్రైలర్ ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: