బిగ్‌బాస్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నాగమణికంఠ.. అతడి భార్య, పాపను చూశారా?

Suma Kallamadi
తెలుగులో బిగ్‏బాస్ సీజన్ 8 ప్రారంభమైంది. ఇప్పటికే వారం రోజులు గడిచింది. ఇక తొలి వారంలో బెజవాడ బేబక్క అనూహ్యంగా ఎలిమినేట్ అయింది. ఇప్పటి వరకు యూట్యూబర్‌గా పేరొందిన ఆమె హౌస్‌లోకి వెళ్లే ముందు ఎంతో కాన్ఫిడెంట్‌గా కనిపించింది. అయితే తొలి వారంలోనే ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. 14 మందితో ఈ షో ప్రారంభం అయింది. అందరిలోనూ ఒక పేరు ప్రస్తుతం బాగా వినిపిస్తోంది. అతడే నాగ మణి కంఠ. బిగ్ బాస్ హౌస్‌లో ఎంతో సైలెంట్‌గా కనిపిస్తూ లోన్లీగా ఉంటున్నాడనే పేరు ఉంది. ఇక ఆ ఒక్క కారణంతో అతడిని తొలి వారంలో ఎక్కువ మంది నామినేట్ చేశారు. 


అందరూ ఒక వైపు ఉంటే, నాగ మణి కంఠ మాత్రం మరో వైపు ఉన్నాడని అర్ధం అవుతుంది. అందరూ అతడినే టార్గెట్ చేసే సరికి, తొలి వీక్ నామినేషన్‌లో ప్రేక్షకులు అతడి వైపు నిలిచారు. అతడికి భారీగా ఓట్లు వేశారు. గత సీజన్‌ల నుంచి చూస్తే హౌస్‌లో ఎవరు ఒంటరిగా ఉంటారో వారి వైపు ప్రేక్షకులు ఎక్కువగా మద్దతు ఇస్తూ కనిపించారు. అంతేకాకుండా వారే చివరికివిజేతలుగా కూడా నిలిచారు. దీంతో తొలి వీక్‌లోనే నాగ మణి కంఠ గురించి ప్రేక్షకులు తెలుసుకోవడం ప్రారంభించారు. ప్రస్తుతం అతడి భార్య, కుమార్తె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుత బిగ్ బాస్ సీజన్‌లో ఉన్న కంటెస్టెంట్లు ఎవరూ ప్రేక్షకులకు అంతగా ఎవరూ తెలియదు. ఎక్కువ మంది సోషల్ మీడియా, సీరియల్స్‌కు చెందిన వారే కనిపిస్తున్నారు. అలాంటి వారిలో నాగ మణి కంఠ ఒకరు. ఆయన బిగ్ బాస్‌‌లో వచ్చీ రాగానే తన గురించి చెప్పారు. తన లైఫ్, ఫ్యామిలీ గురించి తలుచుకుని ఎమోషనల్ అయ్యారు. దీంతో ప్రేక్షకులు కూడా ఆయన ఫ్యామిలీ గురించి ఆరా తీయడం ప్రారంభించారు. ఆయన సోషల్ మీడియా ఖాతాలో ఎలాంటి వివరాలు లభించలేదు. అయితే మరీ లోతుగా ఆయన గురించి ప్రేక్షకులు తెలుసుకోసాగారు. ఈ తరుణంలో ఆయన పెళ్లి ఫొటోలు, ఫ్యామిలీతో ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి. తన కుమార్తెతో, భార్యతో నాగ మణి కంఠ ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనకు తన భార్యకు మధ్య చిన్న మనస్పర్థలు తప్పితే పెద్దగా విభేదాలు లేవని నాగ మణి కంఠ పేర్కొన్నాడు. అంతేకాకుండా వారిని తలుచుకుని భావోద్వేగానికి గురయ్యాడు. కుమార్తెతో ఉన్న అతడి ఫొటోలు చూస్తే ఆ చిన్నారితో తండ్రిగా అతడి అనుబంధాన్ని అర్ధం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: