అందాల భామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుత జనరేషన్లోని దాదాపు అందరి హీరోలతోనూ ఆమె నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. నందమూరి కళ్యాణ్ రామ్ సరసన లక్ష్మీకళ్యాణం సినిమా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్గా ఆమె పరిచయమైంది. ఆ తర్వాత వచ్చిన చందమామ సినిమా ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువ అయింది. ఎంతో అమాయకత్వంతో, అందంగా కనిపించే కాజల్‌ను చూసి ప్రేక్షకులు మైమరిచిపోయారు. చందమామ సినిమాలో అల్లరి, అమాయకత్వంతో కూడిన ఆమె నటనను ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేరు. ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు.
ఆ తర్వాత వచ్చిన మగధీర సినిమాతో ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. ఆ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అందులో ఆమె అందానికి, నటనకు ప్రేక్షకులంతా మైమరిచిపోయారు. ఆ తర్వాత ఆమెకు స్టార్ హీరోలు అందరి సరసనా సినిమా అవకాశాలు దక్కాయి. వాటిలో ఎన్నో సినిమాలో బ్లాక్బస్టర్లుగా నిలిచాయి. ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో నంబర్ 1 హీరోయిన్గా ఆమె నిలిచింది.
తెలుగులో ఆమె మెగా ఫ్యామిలీలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ సరసన నటించింది. తండ్రీకుమారుడితో నటించిన హీరోయిన్గా ఆమె పేరొందింది. ఇతర సీనియర్ హీరోలు బాలకృష్ణ, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ సరసన కూడా ఆమె హిట్ సినిమాల్లో నటించింది. తెలుగులోనే కాకుండా ఆమె తమిళంలోనూ వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంది. అక్కడ సైతం అగ్ర హీరోలు, యంగ్ హీరోల సరసన ఆమె నటించింది. బాలీవుడ్‌లోనూ కొన్ని సినిమాల్లో ఆమె కనిపించింది. ఇక కెరీర్ పీక్‌లో ఉండగానే ఆమె ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును పెళ్లాడింది.
ఈ జంటకు పండంటి బాబు పుట్టాడు. పెళ్లి తర్వాత కాజల్ తన సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసింది. పెళ్లి తర్వాత ఫ్యామిలీకి ఇంపార్టన్స్ ఇచ్చిన ఆమె ప్రస్తుతం తిరిగి కెరీర్‌పై ఫోకస్ చేసింది. ఇటీవలే సత్యభామ సినిమాతో ప్రేక్షకులను ఆమె పలకరించింది. ఆమె ప్రస్తుతం కమల్ హాసన్ సరసన భారతీయుడు 3లో నటిస్తోంది. పర్సనల్ లైఫ్‌తో పాటు తన కెరీర్‌ను బ్యాలెన్స్ చేసుకుంటున్న కాజల్ సోషల్ మీడియాలో అదిరిపోయే ఫొటోలు పోస్ట్ చేసింది. రెడ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లోని సిల్క్ చీరలో అందాల దేవతగా కనిపించింది. ఆ ఫొటోలను ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.