ఏంటి
దగ్గుబాటి ఫ్యామిలీ లో గొడవలా.. ఇది నిజంగానే జరిగిందా.. లేక వట్టి రూమరేనా.. అసలు
వెంకటేష్ సురేష్ బాబు మధ్య గొడవలు ఎందుకు వచ్చాయి. వీరిద్దరి మధ్య కొట్టుకునేంత గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది ఇప్పుడు చూద్దాం.
వెంకటేష్ సురేష్ బాబు కొట్టుకున్నారు అనే న్యూస్ రూమర్ కాదు. నిజమే ఎందుకంటే ఈ విషయాన్ని స్వయంగా
వెంకటేష్ బయట పెట్టారు. ఇక విషయంలోకి వెళ్తే..
చిరంజీవి హోస్టు గా చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు షో కి ఒకసారి
వెంకటేష్ గెస్ట్ గా వచ్చారు.ఆ సమయం లో
దగ్గుబాటి ఫ్యామిలీ గురించి ఎవరికి తెలియని ఒక ఆసక్తికరమైన విషయాన్ని రివీల్ చేశారు.
వెంకటేష్ మాట్లాడుతూ.. మా
నాన్న ఉన్న సమయం లో మేమందరం కలిసి ఉండేవాళ్లం.
అయితే ఆ టైం లో డైనింగ్ టేబుల్ దగ్గర
అన్నయ్య కు, నాకు ఓ విషయంలో చాలా గొడవ జరిగేది అదే కోడి కూర.. మా ఇంట్లో అందరికీ కోడి కూర అంటే చాలా ఇష్టం. ఇక ఇంట్లో ఎక్కువ మంది ఉండడం తో రెండు కోళ్లు కోసేవారు. అయినా కూడా మాకు సరిపోయేది కాదు. దాంతో అందరం డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చిన సమయం లో కూర అయిపోతూ ఉంటే డైనింగ్ టేబుల్ కింద
నాన్న కి తెలియకుండా కాళ్ళ తో
అన్నయ్య నేను ఒకరిని ఒకరం తన్నుకునేవాళ్లం.
కూర అయిపోతూ ఉంటే ఆ ముక్క నాది అంటే నాది అని ఇద్దరం సైగలు చేసుకుంటూ కింద తన్నుకునేవాళ్ళు. ఇక ఆ తర్వాత కొద్ది రోజులకి టేబుల్ దగ్గరికి
రానా కూడా వచ్చేసాడు. దాంతో మా ముగ్గురి మధ్య
వార్ మరింత పెరిగింది. అంటూ సరదాగా వారి కుటుంబం లో జరిగే ఓ ఫన్నీ విషయాన్నీ
వెంకటేష్ షేర్ చేసుకున్నారు.