మొక్కుబడి టాలీవుడ్... వీళ్లకు ప్రజల బాధలు పట్టవ్..!
వచ్చిన నిధులను సర్కారుకు అందించారు. ఇలా..ఆ ఒక్కసమయమే కాదు.. చెన్నైలో(అప్పటి మద్రాస్) కూడా వరదలు వచ్చినప్పుడు టాలీవుడ్ స్పందించింది. కానీ.. రానురాను.. ఏదో ఇచ్చేసి చేతులు దులుపుకొంటున్నారనే వాదన వినిపిస్తోంది. అంకిత భావంతో బాధితులను ఆదుకునేందుకు పెద్దగా ఎవరూ ముందుకు రావడం లేదు. మరీ ముఖ్యంగా మెగా కుటుంబం చేస్తున్న సాయం చూసి.. అందరూ నాలుగు చేతులతో చప్పట్లు కొడుతున్నారు!
మెగా ఫ్యామిలీ.. రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.50 లక్షల చొప్పున ఇచ్చి.. గేట్లు మూసేసింది. ఈ కుటుం బంలో ఇద్దరు మెగా హీరోలుఉన్న విషయం తెలిసిందే. ఇక, ఇదేసమయంలో సూపర్ స్టార్ మహేష్‌బాబు కూడా ఇదే సాయం చేశారు. చెరో 50 లక్షలు ఇచ్చారు. కానీ, జూనియర్ ఎన్టీఆర్ మాత్రం చెరో కోటి రూయలు ఇచ్చారు. అలాగే ప్రభాస్ కూడా.. చెరో కోటి రూపాయలు ఇచ్చారు. ఇక, అతి పెద్ద నిర్మాణ సంస్థ.. వైజయంతి మూవీస్ కూడాఅంతే రేంజ్‌లో `అతి పెద్ద`గా 25 లక్షలు ఇచ్చి.. బాధితుల కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేసింది.
ఇక్కడ చిత్రం ఏంటంటే.. వీరంతా.. ఆధారపడింది ఏపీ, తెలంగాణలపైనే. కానీ, ఈ రాష్ట్రాలకు కష్టం వస్తే.. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే మాత్రం.. ఏదో ఇచ్చామంటే ఇచ్చామని చేతులు దులుపుకొని.. గేట్లు మూసేశారు. ఒక్క ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్‌లు మాత్రమే కొంతలో కొంతైనా బెటర్ అనిపించారని.. సినీ వర్గాల అభిప్రాయం. నిజానికి వీరి కెరీర్‌తో పోల్చుకుంటే.. మెగా కుటుంబం కెరీర్ ఎంత? అని ఆలోచన చేసుకుంటే.. ఆ సాయం వేరేగా ఉండేదని సినీ క్రిటిక్స్ వ్యాఖ్యానిస్తున్నారు. పోనీ. మెగా స్టార్ ఇవ్వలేక పోతే.. జోలె పట్టే రోజులు పోయాయని అనుకుంటే.. ఆన్‌లైన్ ఫండింగ్ అయినా..రెయిజ్ చేయొచ్చు..కానీ, అలా కూడా చేయలేదు. అంతే..!