బాలీవుడ్ నటి
జాన్వి కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికే ఈమె ఎన్నో
హిందీ సినిమాలలో నటించి
బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈమె తెలుగు సినీ పరిశ్రమపై ఫుల్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ నటి యంగ్ టైగర్
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా
కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే భారీ బడ్జెట్ పాన్
ఇండియా మూవీ లో హీరోయిన్గా నటిస్తుంది. ఈ
మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది.
అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం
సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ
మూవీ నుండి కొన్ని పాటలను విడుదల చేయగా అందులో
జాన్వి తన డాన్స్ తో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ
సినిమా మంచి విజయం సాధిస్తే ఈ ముద్దుగుమ్మకు మరింత క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలు వచ్చే అవకాశం చాలా వరకు ఉంది. ఇకపోతే తెలుగులో ఈ ముద్దుగుమ్మ నటించిన మొదటి
సినిమా విడుదల కాకముందే మరో క్రేజీ సినిమాలో కూడా ఈమెకు అవకాశం వచ్చింది. మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ
మూవీ మరి కొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో ఈమె హీరోయిన్గా కనిపించబోతోంది.
ఇలా తెలుగులో వరుస క్రేజీ
సినిమా అవకాశాలను దక్కించుకుంటూ కెరియర్ను ఫుల్
జోష్ లో ముందుకు సాగిస్తున్న ఈ
బ్యూటీ కి
హిందీ సినీ పరిశ్రమలో కూడా అదిరిపోయే రేంజ్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. అసలు విషయం లోకి వెళితే ...
హిందీ సినీ పరిశ్రమంలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి
సిద్ధార్థ్ మల్హోత్ర హీరోగా రూపొందబోయే సినిమాలో జాన్వీ కపూర్ కు ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.