అక్క నిర్మాణంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ.. వైరల్ గా మారిన టైటిల్..!

frame అక్క నిర్మాణంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ.. వైరల్ గా మారిన టైటిల్..!

Divya
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే సమయం రానే వచ్చేసింది బాలయ్య నట వారసుడుగా మోక్షజ్ఞ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లలో బాలయ్య కుమారుడిని లాంచ్ చేయబోతున్నారు. అందుకు సంబంధించి అప్డేట్ ను కూడా ఈ రోజున బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్ వర్మ ఫస్ట్ లుక్ పోస్టర్ని కూడా విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో నందమూరి అభిమానులు బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.

మోక్షజ్ఞ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ కూడా తెలియజేస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్సిటీ నుంచి రెండో ప్రాజెక్టుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ బ్యానర్ పైన సుధాకర్ చేకూరితో పాటు బాలయ్య చిన్న కుమార్తె తేజేశ్వని ఈ చిత్రానికి సంయుక్తంగా నిర్మిస్తున్నారట. మోక్షజ్ఞ తొలి పోస్టర్తోనే ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. లుక్ పరంగా కూడా అదిరిపోయేలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి గాండీవ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తోందట. గతంలో కాస్త లావుగా ఉన్న మోక్షజ్ఞ ఇప్పుడు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ముఖ్యంగా బాలయ్య కూడా ఇందులో ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. అది కూడా అర్జునుడి గా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన కుమారుడు అభిమన్యుడు పాత్రలో మోక్షజ్ఞ కనిపించబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. హనుమాన్ చిత్రంతో పాన్ ఇండియా లెవెల్లో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ తక్కువ బడ్జెట్ తో భారీ సినిమాలను తెరకెక్కించగలరని పేరుని సంపాదించుకున్నారు. అందుకే బాలయ్య అభిమానులు కూడా ఈ డైరెక్టర్ వైపే ఎక్కువమంది ముగ్గు చూపడంతో ఈ డైరెక్టర్ ని ఎంచుకున్నట్లు సమాచారం. మరి మొదటి సినిమా ఇలాంటి రికార్డు తిరగ రాస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: