ది గోట్ తో ప్రభాస్.. సల్మాన్ లను వెనక్కు నెట్టేసిన విజయ్..?

frame ది గోట్ తో ప్రభాస్.. సల్మాన్ లను వెనక్కు నెట్టేసిన విజయ్..?

MADDIBOINA AJAY KUMAR
కొంత మంది హీరోలకు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్లను ఇస్తూ ఉంటారు. అలా భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ప్రధాన కారణం వారికి ఉన్న క్రేజ్. కొంత మంది హీరోలకు అద్భుతమైన క్రేజ్ ఉండడంతో వారి సినిమాకు హిట్ , ఫ్లాప్ లతో ఏ మాత్రం సంబంధం లేకుండా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు వస్తూ ఉంటాయి. అలాగే కొంత మంది హీరోలు నటించిన సినిమాలకు అదిరిపోయే రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ లు కూడా జరుగుతూ ఉంటాయి. అలా ప్రీ రిలీజ్ బిజినెస్ లతోనే నిర్మాతకు లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దానితో భారీ క్రేజ్ ఉన్న హీరోలకు అదిరిపోయే రేంజ్ రెమ్యూనరేషన్లను ఇస్తూ ఉంటారు.

ఇకపోతే ఇంతకాలం వరకు ఇండియాలోనే అత్యంత రెమ్యూనిరేషన్ తీసుకునే హీరోల లిస్టులో ప్రభాస్ , సల్మాన్ ఖాన్ మొదటి రెండు స్థానాల్లో కొనసాగినట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఒక్కో సినిమాకు దాదాపుగా 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోగా , సల్మాన్ ఖాన్ ఒక్కో మూవీకి 125 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే వీరిద్దరూ చాలా కాలం పాటే ఇండియాలో అత్యంత ఎక్కువ పారితోషకం తీసుకున్న హీరోల లిస్టులో మొదటి రెండు స్థానాల్లో కొనసాగినట్లు తెలుస్తోంది. ఇక తమిళ నటుడు తలపతి విజయ్ తాజాగా ది గోట్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమా తాజాగా సెప్టెంబర్ 5 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ కి తలపతి విజయ్ ఏకంగా 200 కోట్ల పారితోషకం తీసుకొని మొదటి స్థానానికి వచ్చేసి ప్రభాస్ , సల్మాన్ ఖాన్ లను రెండవ , మూడవ స్థానాలకి నెట్టేసినట్లు తెలుస్తోంది. ఇలా కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ "ది గోట్" మూవీ కోసం 200 కోట్ల భారీ రెమ్యూనరేషన్ ను తీసుకున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: