తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో
శ్రీను వైట్ల ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభం నుండి మంచి విజయాలను అందుకుంటూ ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ
టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్
డైరెక్టర్ స్థాయి కి ఎదిగాడు. ఇక స్టార్
డైరెక్టర్ స్థాయికి ఎదిగిన తర్వాత
శ్రీను వైట్ల ఆ స్థాయి విజయాలను అందుకోవడంలో చాలా వరకు వెనకబడిపోయాడు. ఆఖరుగా
శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన దూకుడు
సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ
మూవీ తర్వాత
శ్రీను వైట్ల తీసిన ఏ
సినిమా కూడా ఆ స్థాయి విజయాన్ని అందుకోలేదు.
ఇకపోతే తాజాగా
శ్రీను వైట్ల , గోపీచంద్ హీరోగా రూపొందిన విశ్వం అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ
మూవీ లో మోస్ట్
బ్యూటిఫుల్ నటిమని కావ్య దాపర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... పీపుల్స్
మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీ జీ
విశ్వ ప్రసాద్ ఈ
మూవీ ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను
అక్టోబర్ 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే తాజాగా ఈ
మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. ఈ
మూవీ టీజర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఇకపోతే ఈ
మూవీ టీజర్ విడుదల సందర్భంగా ఈ
మూవీ బృందం ఓ
ఈవెంట్ ను ఏర్పాటు చేసింది.
అందులో భాగంగా
శ్రీను వైట్ల మాట్లాడుతూ ... గోపీచంద్ తో చాలా కాలం క్రితమే
సినిమా చేయాల్సింది. ఇక ఈ
మూవీ కథను గోపీచంద్ కు చెప్పినప్పుడు ఆయన ఫుల్ సాటిస్ఫై అయ్యాడు. వెంటనే స్టార్ట్ చేద్దాం అన్నాడు. కాకపోతే కథ బాగానే ఉంది కానీ ప్రేక్షకులు నా నుండి
కామెడీ కోరుకుంటారు. ఈ కథలో కరెక్టుగా
కామెడీ సెట్ అయ్యాక సినిమాను స్టార్ట్ చేద్దాం అని చెప్పాను. అది సెట్ కావడానికి చాలా సమయం పట్టింది. అని
శ్రీను వైట్ల చెప్పుకొచ్చాడు.