ఆ హీరోయిన్లతో అఫైర్లు పెట్టుకున్న క్రికెటర్లు.. పెళ్లి మాత్రం చేసుకోలేదు..?

Suma Kallamadi
క్రికెట్, బాలీవుడ్ రెండూ చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. క్రికెటర్లు, బాలీవుడ్ నటీమణులు ప్రేమలో పడటం చాలా సాధారణం. వీరి ప్రేమ కథలు చాలా తరచుగా మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది క్రికెటర్లు బాలీవుడ్ నుంచే తమ జీవిత భాగస్వామిని ఎంచుకున్నారు. కానీ, అన్ని ప్రేమ కథలు వివాహంతో ముగియవు. కొందరు ఒకరినొకరు చాలా ఇష్టపడినా, వివాహం చేసుకోలేకపోయారు. ఇలాంటి కొన్ని ఉదాహరణల గురించి తెలుసుకుందాం.
* యువరాజ్ సింగ్, కిమ్ శర్మ
టీమిండియా ఆల్ రౌండర్ క్రికెటర్ యువరాజ్ సింగ్‌ కిమ్ శర్మతో ప్రేమాయణం నడిపాడని మీడియా కోడై కూసింది. యువరాజ్, కిమ్ చాలా కాలం ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే, వీళ్లు తమ సంబంధాన్ని ఎప్పుడూ బహిరంగంగా ఒప్పుకోలేదు. వారు తమ వ్యక్తిగత జీవితాలను చాలా సీక్రెట్ గా ఉంచారు. చివరికి వేరే వేరుగా జీవించడం ప్రారంభించారు. యువరాజ్ తరువాత నటి హేజెల్ కీచ్‌ను వివాహం చేసుకున్నాడు. దీంతో కిమ్‌తో ఆయనకు ఉన్న సంబంధం గురించి వస్తున్న అనుమానాలకు తెరపడింది.
* జహీర్ ఖాన్‌, ఇషా షర్వాణి
ప్రముఖ క్రికెటర్ జహీర్ ఖాన్‌కు నటి ఇషా షర్వాణితో ఎనిమిది సంవత్సరాల పాటు అఫైర్ నడిపాడు. వారిద్దరి ప్రేమ వ్యవహారం అందరికీ తెలుసు. చాలా కాలం కలిసి గడిపినప్పటికీ, జహీర్, ఇషా చివరకు విడిపోయారు. తరువాత జహీర్ మరో నటి సాగరిక ఘాట్‌గేను వివాహం చేసుకున్నాడు. సాగరిక షారుఖ్ ఖాన్‌ మూవీ ‘చక్‌దే ఇండియా’తో పాపులర్ అయ్యింది.
రవి శాస్త్రి అమృతా సింగ్
 
ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు, ప్రస్తుతం కామెంటేటర్‌గా పని చేస్తున్న రవి శాస్త్రి, నటి అమృతా సింగ్ ప్రేమ వ్యవహారం అందరికీ తెలుసు. ఇతరుల మాదిరి కాకుండా, రవి, అమృతా తమ ప్రేమ గురించి బహిరంగంగా ప్రకటించారు. అయితే, వారి ప్రేమ ఎక్కువ కాలం నిలవలేదు   వారు చివరికి విడిపోయారు. రవి శాస్త్రి 1990లో రితు సింగ్‌ను వివాహం చేసుకున్నారు. అమృతా సింగ్ తన కంటే ఐదు సంవత్సరాలు చిన్నవాడైన నటుడు సైఫ్ అలీ ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. అయితే, అమృతా, సైఫ్ తరువాత విడాకులు తీసుకున్నారు. సైఫ్ తరువాత నటి కరీనా కపూర్‌ను వివాహం చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: