బట్టలు అలా ఉంటే రేప్ చేస్తారా.. స్టార్ యాక్ట్రెస్ షాకింగ్ కామెంట్స్..?
జ్యోతి రాయ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'అమ్మాయిలే అమ్మాయిలకు శత్రువులు. ఈ మధ్య ఓ అత్యాచారం జరిగింది. ఆ న్యూస్‌కు సంబంధించి కామెంట్స్ పరిశీలిస్తే అబ్బాయిల కంటే అమ్మాయిలే చెడుగా కామెంట్లు చేయడం కనిపించింది. ఒకరి గురించి నెగిటివ్‌గా కామెంట్లు, పోస్టులు పెట్టడం, వాటిని ఇతరులు గుడ్డిగా షేర్ చేయడం చాలా బాధాకరం. సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోల పెడితే డబ్బులు వస్తాయనే మాట వాస్తవమే కానీ ఆ డబ్బుల కోసం ఒకరి పరువును ఫ్యామిలీని బజారుకి ఈడ్చడం ఏమాత్రం అంగీకరించినది కాదు. ఎవరినీ జడ్జి చేసే హక్కు ఎవరికీ లేదు." అni ఫైర్ అయ్యింది. "నేను ఆలస్యంగా సినిమాలు చేస్తున్న బహుశా నాకు అంతే అదృష్టం ఉందేమో" అని కూడా ఆమె కామెంట్లు చేసింది.
జ్యోతి రాయ్ ఇంకా మాట్లాడుతూ, 'నాకు పర్సనల్‌గా వచ్చే మెసేజ్‌లు చూపిస్తే ఎవరైనా గుండె పగలాల్సిందే. చాలా మంది బయట శ్రీరాముడిలా చాలా మంచిగా మాట్లాడుతారు. కానీ మెసేజ్‌ల్లో మాత్రం చాలా అసభ్యకరమైన, అశ్లీలమైన పదాలు వాడతారు. ఇప్పుడు నీ అక్క, నీ చెల్లి, మీ అమ్మ.. ఒకవేళ బట్టలు లేకుండా ఉంటే మీరు వాళ్లను రేప్ చేస్తారా? బట్టలు మంచిగా వేసుకోకపోతే అత్యాచారం జరగక ఇంకేం జరుగుతుంది అని కొందరు మాట్లాడుతున్నారు. రేపు మీ కూతురికి అలాగే జరిగితే ఇంతే మాట్లాడతారా' అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
బెంగళూరులో పుట్టిన జ్యోతి రాయ్ మొదట మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. 'బందె బరాటవ కాలా' సీరియల్‌తో నటిగా మారింది. చాలా కన్నడ సీరియళ్లలో యాక్ట్ చేస్తూ బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఆపై తమిళం, తుళు భాషల్లో కూడా చాలా సీరియల్స్ లో నటించింది. అనంతరం 'కన్యాదానం' సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది. రీసెంట్ గా 'గుప్పెడంత మనసు'తో మరోసారి తెలుగువారిని అలరించింది. ఇందులో ఆమె పోషించిన జగతి పాత్ర చాలా హైలెట్ అయింది.