తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నిర్మాతలలో
దిల్ రాజు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలను నిర్మించాడు. అందులో చాలా
మూవీ లు
బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఇకపోతే
దిల్ రాజు ఇప్పటికే ఎంతో మంది దర్శకులను , హీరోలను , హీరోయిన్లను
వెండి తెరకు పరిచయం చేశాడు. ఈయన దర్శకులుగా పరిచయం చేసిన ఎంతో మంది ప్రస్తుతం
టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్లుగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. కెరీర్ ను ప్రారంభించిన కొత్తలో అనేక చిన్న సినిమాలను నిర్మించిన
దిల్ రాజు ఈద్య మాత్రం ఎక్కువ శాతం భారీ బడ్జెట్ సినిమాలను , స్టార్ హీరోలతో సినిమాలను చేస్తున్నాడు.
చిన్న సినిమాల వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఇకపోతే తాజాగా
దిల్ రాజు ,
సుహాస్ హీరోగా రూపొందిన జనక అయితే గనక అనే ఒక చిన్న సినిమాను నిర్మించాడు. ఈ
మూవీ ని మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లలో
దిల్ రాజు పాల్గొన్నారు. ఈ మధ్య చిన్న సినిమాల విడుదలకు ముందు ప్రీమియర్ షో ను ప్రదర్శిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. దీని గురించి
దిల్ రాజు స్పందిస్తూ చిన్న సినిమాల గురించి పెద్దగా జనాలు పట్టించుకోరు.
దానితో
సినిమా విడుదలకు ఒక రోజు ముందే షో స్ వేసినట్లు అయితే దానికి మంచి టాక్ వస్తే ఆ సినిమాకు రిలీజ్ రోజు నుండి మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అది చిన్న సినిమాల ప్రమోషన్స్ ఇక అదే బాగోలేని సినిమాకు ముందు రోజు వేసినట్లు అయితే టాక్ నెగిటివ్ గా వస్తే రిలీజ్ రోజు చూడడానికి ఎవరూ ఉండరు. దానివల్ల
సినిమా మరింత పెద్ద స్థాయిని అందుకునే అవకాశం ఉంటుంది అని
దిల్ రాజు తాజాగా చెప్పుకొచ్చాడు.