వామ్మో విష్ణు ప్రియా ఏంటి ఇలా మారిపోయింది... అప్పుడేమో ఆలా .. ఇప్పడూ ఇలా..?
గతంలో విష్ణుప్రియ ఎన్ని కోట్లు ఇచ్చినా సరే.. నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళను. నేను బిగ్బాస్ పర్సన్ కాదు. నేను ఆ షోను ఇప్పటివరకు చూడలేదు. అంతేకాకుండా.. నేను పర్సనల్ గా బిగ్ బాస్ ను ఎంకరేజ్ కూడా చేయను. నేను ఎప్పటికీ ఆ షో కి వెళ్ళను. ఒకవేళ వెళ్తే నన్ను నిందించండి అంటూ ఆ ఇంటర్వ్యూలో తెలియజేసింది.
ఇక గతంలో అయితే అప్పుడు ఏమో అలా మాట్లాడి.. ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్లడంతో కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు విష్ణు ప్రియని ట్రోల్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. మరోవైపు మనుషుల అభిప్రాయాలు మారిపోతాయి.. డబ్బులు కూడా బాగా సంపాదించుకోవచ్చని వెళ్లి ఉండొచ్చు అని పలువురు వారి భావన తెలియజేస్తున్నారు. అంతేకాకుండా.. అవసరాలు మనుషులను మారుస్తాయి అంటే ఇదేనేమో మరి దీనిపై హౌస్ నుంచి బయటకు వచ్చాక విష్ణు ప్రియ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. ఆదివారం నాడు బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ అంగరంగ వైభవంగా మొదలైంది.