నాచురల్ స్టార్ నాని పోయిన సంవత్సరం మొదటగా దసరా మూవీ తో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత హాయ్ నాన్న మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో విజయాన్ని అందుకున్నాడు. ఇలా వరుస విజయాలతో ఫుల్ జోష్లో ఉన్న నాని తాజాగా సరిపోదా శనివారం అనే సినిమాలో హీరోగా నటించాడు. ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఆగస్టు 15 వ తేదీన విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఇక ఈ మూవీ కి సంబంధించిన టికెట్ బుకింగ్స్ ఆగస్టు 24 వ తేదీనే బుక్ మై షో ఆప్ లో ఓపెన్ అయ్యాయి. ఇక ఈ సినిమా విడుదల తేదీకి ముందు రోజు అయినటువంటి ఆగస్టు 28 వ తేదీ వరకు ఈ సినిమా టికెట్ బుకింగ్లకి బుక్ మై షో లో భారీ స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. ఈ మూవీ విడుదల అయిన రోజు ఈ మూవీ కి మంచి టాక్ రావడంతో బుక్ మై షో లో ఈ సినిమా టికెట్ సేల్స్ భారీగా పెరిగాయి. ఇక ఈ మూవీ విడుదల అయిన రోజు కంటే ఆ తర్వాత రోజు అనగా ఆగస్టు 30 వ తేదీన బుక్ మై షో లో ఈ సినిమా టికెట్ సేల్స్ మరింతగా పెరిగాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.
ఆగస్టు 24 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 12.68 కే టికెట్లు బుక్ మై షో ఆప్ లో సేల్ అయ్యాయి.
ఆగస్టు 25 వ తేదీన 16.49 కే టికెట్లు సేల్ అయ్యాయి.
ఆగస్టు 26 వ తేదీన 19.01 కే టికెట్లు సేల్ అయ్యాయి.
ఆగస్టు 27 వ తేదీన 31.56 కే టికెట్లు సేల్ అయ్యాయి.
ఆగస్టు 28 వ తేదీన దాదాపుగా 90 కే టికెట్లు సేల్ అయ్యాయి.
ఆగస్టు 29 వ తేదీన 191.44 కే టికెట్లు సేల్ అయ్యాయి.
ఆగస్టు 30 వ తేదీన 194.58 కే టికెట్లు సేల్ అయ్యాయి.
ఇలా ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు సూపర్ పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకు విడుదల రోజు కంటే ఆ తర్వాత రోజు బుక్ మై షో లో ఎక్కువ టికెట్ సేల్స్ జరిగాయి.