ఈ మధ్యకాలంలో ఏదైనా స్టార్
హీరో పుట్టిన రోజు వచ్చింది అంటే చాలు ఆ హీరోకు సంబంధించిన బ్లాక్ బాస్టర్
మూవీ లను రీ రిలీజ్ చేస్తూ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈ సంవత్సరం ఆగస్టు 9 వ తేదీన మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన బ్లాక్ బాస్టర్ మూవీలలో ఒకటి అయినటువంటి
మురారి మూవీ ని రీ రిలీజ్ చేశారు. దానికి అద్భుతమైన కలెక్షన్లు వచ్చాయి. ఇక ఆగస్టు నెలలో
చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 22 వ తేదీన ఆయన నటించిన
బ్లాక్ బస్టర్ మూవీ అయినటువంటి
ఇంద్ర మూవీ ని రీ రిలీజ్ చేశారు.
ఇకపోతే తాజాగా ఈ
మూవీ నిర్మాత దానయ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా
గబ్బర్ సింగ్ మూవీ రీ రిలీస్ కాబోతుంది. దానితో మీ
సినిమా నడుస్తున్న కొన్ని థియేటర్లను ఆ సినిమాకు ఇచ్చారంట ... కదా. దాని ద్వారా మీకు ఏమైనా నష్టం కలిగే అవకాశం ఉందా అనే ప్రశ్న ఎదురయింది. దానికి దానయ్య సమాధానం ఇస్తూ ... ఆయన
పవర్ స్టార్ , ఈయన నాచురల్ స్టార్. ఎవరి స్టామినా వారిది. ఆ
సినిమా రీ రిలీజ్ వల్ల మాకు ఎలాంటి నష్టం లేదు అని దానయ్య క్లారిటీ ఇచ్చాడు.