సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో చాలా మంది స్పీడ్ గా సినిమాలు చేయడం ఈ మధ్య కాలంలో ఆపేశారు. ఫలానా దర్శకుడితో సినిమా చేయాలి అనుకుంటే ఆదర్శకుడి కోసం వెయిట్ చేస్తూ ఉండడం , ఒక్క సినిమా పైనే టైమ్ అంత వేస్ట్ చేస్తూ సమయాన్ని వృధా చేస్తూ వస్తున్నారు. ఇక మరి కొంత మంది మాత్రం పక్కా ప్లానింగ్ తో దర్శకుల కోసం వెయిట్ చేయకుండా మంచి కథలను ఎంచుకొని స్పీడుగా సినిమాలను చేస్తూ ఎక్కువ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలాంటి వారిలో నాచురల్ స్టార్ నాని ఒకరు. నాని ఎప్పుడూ కూడా ఒక దర్శకుడు కోసం వెయిట్ చేస్తూ కాలాన్ని వృధా చేయడు.
ఆయన కొత్త దర్శకుడికి కూడా ఛాన్సులు ఇస్తూ ఉంటాడు. దానితో ఆయన చాలా స్పీడ్ గా సినిమాలను పూర్తి చేస్తూ వస్తున్నాడు. ఇకపోతే తాజాగా నాని , వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన సరిపోదా శనివారం అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఇక ఈ సినిమా పూర్తి అయ్యిందో లేదో వచ్చే నెల 5 వ తేదీన హిట్ ది థర్డ్ కేస్ అనే మూవీ ని ప్రారంభించడానికి నాని రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అలాగే దసరా మూవీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో కూడా ఓ మూవీ ని స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఏక కాలంలో నాని రెండు మూవీ ల షూటింగ్లలో పాల్గొనడానికి నాని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
ఇలా నాని ఒక దర్శకుడి కోసం వెయిట్ చేయడం కాకుండా తన దగ్గరికి వస్తున్న దర్శకులలో మంచి దర్శకులను , మంచి కథలను ఎంచుకొని సినిమాలను చేస్తూ వెళుతున్నాడు. దానితో ఈయనకు మంచి విజయాలు దక్కుతున్నాయి. ఎక్కువ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ వారిని బాగా ఆకట్టుకుంటున్నాడు. నాని హీరోగా రూపొందిన సరిపోదా శనివారం సినిమా ఆగస్టు 29వ తేదీన విడుదల ఈ ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రదర్శించబడుతుంది.