బాలయ్య 50 ఏళ్ల సినీ వేడుకకు ఆ ఇద్దరు స్టార్స్ దూరం.. కారణం అదేనా..?
ఇక నేటితో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు బాలకృష్ణ. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలుగు సినిమా పరిశ్రమ తరఫున ప్రముఖులంతా కూడా బాలయ్యకు గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుపుతున్నారు.ఈ కార్యక్రమం హైదరాబాదులో ఎల్లుండి అనగా సెప్టెంబర్ ఒకటవ తేదీ సాయంత్రం జరగబోతోంది. ఈ సందర్భంగా వేడుకలకు హాజరు కావాలంటూ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు , రేవంత్ రెడ్డి తో పాటు ప్రముఖులు చిరంజీవి, పవన్ కళ్యాణ్ , అమితాబ్ బచ్చన్ లాంటి వారందరికీ కూడా ఆహ్వానం అందింది. అంతే కాదు శివ రాజ్ కుమార్, మమ్ముట్టి , మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు.ఇక మెగా కుటుంబంలోని సభ్యులు అల్లు అర్జున్, అల్లు అరవింద్ ఇలా చాలామంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి రాబోతున్నారు . మొత్తం సౌత్ సినీ ఇండస్ట్రీని మొదలుకొని బాలీవుడ్ వరకు చాలామంది సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి వస్తున్నారు. తెలుగు నుంచి దాదాపు హీరోలంతా ఈ వేడుకలో పాలు పంచుకోనున్నారు. ముఖ్యంగా యువ హీరోలు విశ్వక్‌సేన్, సిద్దు జొన్నలగడ్డ, కార్తికేయ ఇలా దాదాపు 10మంది హీరోలు బాలయ్య కోసం స్టెప్పులు వేయబోతున్నారు. కొన్ని కామెడీ స్కిట్లు కూడా ప్లాన్ చేశారు. అందుకోసం ఈ హీరోలంతా రిహార్సల్స్ కూడా చేస్తున్నారు.
చిరంజీవి, అల్లు అర్జున్, వెంకటేష్ తదితర కథానాయకులు ఈ వేడుకలో పాలుపంచుకోనున్నారు. నాగార్జున కూడా ఇదే వేదికపై కనిపించే అవకాశాలు ఉన్నాయి. పవన్ కల్యాణ్ కూడా వస్తారని ప్రచారం జరిగింది. అయితే సెప్టెంబరు 2న పవన్ పుట్టిన రోజు. కాబట్టి రావడం వీలు కావడం లేదని తెలుస్తోంది. తమిళ చిత్రసీమ నుంచి విజయ్‌సేతుపతి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మలయాళం నుంచి ఇద్దరు ముగ్గురు హీరోలు, హీరోయిన్లు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోనున్నారు. ఆదివారం ఏఏ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారన్న విషయం ఈరోజు సాయింత్రానికల్లా అధికారికంగా ప్రకటిస్తారు.కానీ సొంత ఇంటి కుటుంబ సభ్యులైన ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ లను మాత్రం ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదు అని తెలుస్తోంది. నిజానికి మొదట్లో తెలుగుదేశం పార్టీతో పాటు బాలకృష్ణ , ఇతర నందమూరి కుటుంబ సభ్యులందరికీ ఎన్టీఆర్కు మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవి.2009 ఎన్నికల తర్వాత పార్టీకి దూరం జరిగారు ఎన్టీఆర్. అయితే దీనికి కూడా కారణం లేకపోలేదు 2009 ఎన్నికలలో జోరుగా ప్రచారం నిర్వహించిన ఎన్టీఆర్ ను టిడిపి దూరం పెట్టింది. పైగా వైయస్ జగన్ ప్రభుత్వం చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు కూడా ఎన్టీఆర్ స్పందించలేదు. అంతేకాదు ఆయన అనుచరులైన వల్లభనేని వంశీ, కొడాలి నాని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులపై చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినా సరే వారిని నియంత్రించే ప్రయత్నం చేయలేదు.దీంతో ఎన్టీఆర్ పైన వ్యతిరేకత ఏర్పడింది. మరొకవైపు కళ్యాణ్ రామ్ కు ఆర్థిక సమస్యలు అన్నింటిని ఎన్టీఆర్ తీర్చేయడంతో ఎన్టీఆర్ మాట కళ్యాణ్ రామ్ జవదాటడం లేదు. అందుకే అందరికీ ఆహ్వానం అందిస్తున్నా.. వీరిద్దరికి ఆహ్వానం మాత్రం అందలేదు అని తెలుస్తోంది. మరి వీరికి ఆహ్వానం అందిందా లేదా అనే పూర్తి వివరాలు తెలియాలి అంటే సెప్టెంబర్ ఒకటి సాయంత్రం వరకు ఎదురు చూడాల్సిందే.
మరింత సమాచారం తెలుసుకోండి:
-
Allu Aravind
-
Mammootty
-
Mohanlal
-
Shiva
-
kalyan ram
-
karthikeya
-
kartikeya
-
Kodali Nani
-
siddhu
-
lord siva
-
sunday
-
Pawan Kalyan
-
Revanth Reddy
-
Hyderabad
-
Balakrishna
-
Comedy
-
Yuva
-
NTR
-
Akkineni Nagarjuna
-
kalyan
-
Venkatesh
-
september
-
Tamil
-
CBN
-
Evening
-
bollywood
-
Industries
-
Cinema
-
Telugu
-
Amitabh Bachchan
-
Jagan
-
Telugu Desam Party
-
TDP