సినిమా ఇండస్ట్రీలో కొంత మందికి మాస్ ఈమేజ్ ఉంటే , కొంత మంది కి క్లాస్ ఇమేజ్ ఉంటుంది. కొంత మంది కి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఇలా ఒక్కొక్క హీరోకు ఒక్కో జోనర్ లో మంచి గుర్తింపు ఉంటుంది. వారు అలాంటి సినిమాలు తీసినట్లు అయితే ప్రేక్షకులు కూడా బాగా వాటిని ఇష్టపడుతుంటారు. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన మాస్ ఈమేజ్ కలిగిన హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఈయన సినిమా వచ్చింది అంటే చాలు ఆ సినిమాలో అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు , మాస్ పాటలు , అందుకు తగిన డాన్స్ ఉండాలి అని ఆయన అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకులు కోరుకుంటూ ఉంటారు.
దానితో చిరంజీవి మాస్ సినిమా తీశాడు అంటే ఆ సినిమా కథ కాస్త వీక్ గా ఉన్న ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్న సందర్భాలు ఉన్నాయి. అదే చిరంజీవి కాస్త ప్రయోగాత్మకంగా క్లాస్ మూవీలలో నటించినట్లు అయితే ఆ కథ అద్భుతంగా ఉన్నా కూడా చిరంజీవి అంటే యాక్షన్ , పాటలు , డాన్సులు , డైలాగులు ఊహించే జనాలు అంత క్లాస్ సినిమాలలో ఆయనను చూసి పెద్దగా ఇంప్రెస్ కాకపోవడం వల్ల మంచి కథ అయినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన సినిమాలు ఉన్నాయి. ఇకపోతే కొన్ని రోజుల క్రితం చిరంజీవి , వెంకటేష్ కు సంబంధించిన ఒక ఈవెంట్ లో పాల్గొన్నాడు.
అందులో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ ... నేను కొన్ని రోజుల క్రితం డాడీ అనే సినిమాలో నటించాను. అది మంచి కథతో రూపొందిన సినిమా. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అలాంటి సమయంలో వెంకటేష్ నా దగ్గరికి వచ్చాడు. డాడీ సినిమా తీశారు కదా ... చాలా అద్భుతమైన కథ. కాకపోతే మీపై ఆడలేదు. అది నాపై అయితే కచ్చితంగా బ్లాక్ బాస్టర్ అయ్యేది అన్నాడు. అలా వెంకటేష్ , నేను ఎంతో ఓపెన్ గా మాట్లాడుకుంటూ ఉంటాం అని చిరంజీవి చెప్పుకొచ్చాడు.